'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్
- December 15, 2024
హైదరాబాద్: బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిఖిల్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. టైటిల్ గెలవడంతో రూ.55 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. లగ్జరీ కారుని సొంతం చేసుకున్నాడు. ఇక గౌతమ్ రన్నరప్ గా నిలిచాడు. బిగ్‌బాస్-8 ఫినాలేకు వచ్చిన విజయ్ సేతుపతి, ముంజు వారియర్ తమ సినిమా గురించి మాట్లాడారు.
అనంతరం హౌస్‌లోకి వెళ్లి, ఉన్న ముగ్గురిలో తక్కువ ఓట్లు వచ్చిన నబీల్‌ను బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత నిఖిల్, గౌతమ్ టాప్ 2 లో ఉండగా.. నాగార్జున హౌస్ లోకి వెళ్లి వాళ్లకు గోల్డ్ సూట్ కేస్ అఫర్ చేశారు. కానీ దాన్ని ఇద్దరూ రిజెక్ట్ చేశారు. దాంతో నాగార్జున ఇద్దరినీ స్టేజ్ పైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత చీఫ్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ ముందు నిఖిల్ ను విన్నర్ గా అనౌన్స్ చేశారు నాగార్జున.
కాగా ఈ సీజన్ లో మెయిన్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు నిఖిల్. మొదటి నుంచి తన ఆట, మాటతీరుతో అందరి మనసులు గెల్చుకుంటున్నాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లోనూ చురుగ్గా పార్టిసిపేట్ చేశాడు.దీంతో టాప్ -2లోకి వచ్చాడు. ఇక గౌతమ్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.గత సీజన్ లో ఎదురైన చేదు అనుభవాలను చక్కదిద్దుకుంటూ చక్కటి ఆటతీరు ప్రదర్శించాడు. ఇప్పుడు ఏకంగా టైటిల్ ఫేవరేట్లలో ఒకడిగా నిలిచాడు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







