జాతీయ స్థాయి చేతిరాత పోటీల విజేతలకు అభినందనలు తెలిపిన కలెక్టర్

- December 16, 2024 , by Maagulf
జాతీయ స్థాయి చేతిరాత పోటీల విజేతలకు అభినందనలు తెలిపిన కలెక్టర్

మచిలీపట్నం: పాఠ్యపుస్తకాలు చదివితే మంచి విషయ పరిజ్ఞానం పొందగలుగుతారని, కావున పాఠ్యపుస్తకాలు చదవటం అలవాటు చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు.అఖిల భారత చేతి వ్రాత & గ్రాఫాలజీ అసోసియేషన్ న్యూఢిల్లీ ఆధ్వర్యంలో 2024 జులై 14న దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయస్థాయి చేతిరాత పోటీలలో ఉమ్మడి కృష్ణాజిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సోమవారం కలెక్టరేట్లో సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చేతి వ్రాత చూస్తే క్యారెక్టర్ తెలుస్తుందనే నానుడి ఉందన్నారు.రైటింగ్ ప్రాక్టీస్ రాను రాను తగ్గుతున్న పరిస్థితులలో హ్యాండ్ రైటింగ్ పోటీలు విద్యార్థుల్లో విద్యపట్ల ఆసక్తిని, స్ఫూర్తిని కలిగిస్తామన్నారు. ఐఏఎస్ పరీక్షలు రాసేటప్పుడు హ్యాండ్ రైటింగ్ క్లాసులకు తాను వెళ్లిన విషయం కలెక్టర్ గుర్తు చేసుకున్నారు. మంచి చేతి వ్రాత తో పాటు వేగంగా రాయడం  తోనే విజయం సాధిస్తారని, ఐఏఎస్ వంటి పరీక్షల్లో ఐదు నిమిషాల్లో ఒకటిన్నర పేజీలు రాయాల్సి ఉంటుందని అన్నారు. బాల్యంలోనే చేతివ్రాత  పట్ల ఆసక్తి కలిగి నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని, మీ చేతి వ్రాత లాగానే మీ భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. విజేతలలో పదవ తరగతి పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు స్ఫూర్తినిస్తూ మార్కులే జీవితం కారాదని, విషయ జ్ఞానం అవగాహన ముఖ్యమన్నారు.ఫలితంగా సొంతంగా రాయడం అలవాటు అవుతుందన్నారు. అఖిలభారత చేతి వ్రాత అండ్ గ్రాఫాలజీ అసోసియేషన్ కార్యదర్శి పి భువనచంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ పోటీలలో 3 లక్షల మంది పాల్గొన్నారని, జాతీయస్థాయిలో జిల్లాకు చెందిన 5 మంది విద్యార్థులు గెలుపొందగా, వీరితోపాటు రాష్ట్ర, జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు మెడల్స్ అందజేసినట్లు తెలిపారు. ఆయా పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com