అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు.. అడివి శేష్ ‘డెకాయిట్’ ప్రేమ కథ..
- December 17, 2024
తక్కువ బడ్జెట్ లో మంచి మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ సినిమాలు అందచేసి హిట్స్ కొడతాడు అడివిశేష్. శేష్ చివరగా 2022లో హిట్ 2 సినిమాతో వచ్చి విజయం సాధించాడు. ఆ సినిమా వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఇంకా అడివి శేష్ దగ్గర్నుంచి ఎలాంటి సినిమా రాలేదు. కానీ ప్రస్తుతం కొన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల అడివిశేష్, శృతి హాసన్ జంటగా డెకాయిట్ అనే సినిమాని ప్రకటించారు. ఈ టైటిల్ కు ఒక ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు.
ప్రస్తుతం డెకాయిట్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటికే డెకాయిట్ సినిమా నుంచి గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు. అయితే కొన్ని కారణాలతో శృతి హాసన్ ఆ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. నిన్న అడివి శేష్ తో పాటు ఇంకో హీరోయిన్ ఫేస్ కనపడకుండా ఉన్న డెకాయిట్ సినిమా కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. దీంతో ఆ పోస్టర్ లో ఉన్నది మృణాల్ ఠాకూర్ అని, శృతి హాసన్ సినిమా నుంచి తప్పుకుందని క్లారిటీ వచ్చేసింది అందరికి.
తాజాగా నేడు అడివి శేష్ పుట్టిన రోజు సందర్భంగా డెకాయిట్ సినిమా నుంచి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసి అధికారికంగా ఇందులో మృణాల్ ఠాకూర్ నటిస్తుందని ప్రకటించారు. మృణాల్ ఒక పోస్టర్ షేర్ చేస్తూ.. అవును వదిలేసాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను అని రాసుకొచ్చింది. దీనికి రిప్లైగా శేష్ మరో పోస్టర్ షేర్ చేసి.. అవును ప్రేమించావు.. కానీ మోసం చేసావు.. ఇడిచిపెట్టను…తేల్చాల్సిందే అని రాసుకొచ్చాడు.
Avunu preminchavu..
— Adivi Sesh (@AdiviSesh) December 17, 2024
Kaani mosam chesavu..!
Idichipettanu..thelchaalsindhe 💥
అవును ప్రేమించావు..
కానీ మోసం చేసావు..!
ఇడిచిపెట్టను...తేల్చాల్సిందే 💥
Get ready for #DACOIT ! @mrunal0801 https://t.co/mpLZxzFyFz pic.twitter.com/RpOglgjeE9
దీంతో డెకాయిట్ సినిమా ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగే ఆసక్తికర కథ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో యువ కెమరామెన్ షానిల్ డియో దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్నాడు. మరి శృతి హాసన్ ఎందుకు ఈ సినిమా నుంచి తప్పుకుందో, ఆల్రెడీ షూట్ చేయడం వల్ల ఎంత నష్టం వచ్చిందో అని చర్చిస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







