దుబాయ్ లో 17 వాహనాలు సీజ్..101 జరిమానాలు జారీ..!!
- December 18, 2024
దుబాయ్: అల్ మైదాన్ స్ట్రీట్‌లో నిర్లక్ష్యంగా, ఇతరులకు ఇబ్బందులు లిగించే ప్రవర్తనకు పాల్పడిన డ్రైవర్లపై దుబాయ్ పోలీసులు కొరడా ఝులిపించారు. గత వారం 17 వాహనాలను స్వాధీనం చేసుకొని 101 జరిమానాలు జారీ చేశారు. చట్టవిరుద్ధంగా వాహనాల వినియోగం, అధిక శబ్దం సృష్టించడం, ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వల్ల వారితోపాటు ఇతరకుల భద్రతకు ప్రమాదం ఉందని అసిస్టెంట్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రూయి తెలిపారు. జప్తు చేయబడిన వాహనాలు ఫెడరల్ ట్రాఫిక్, రోడ్స్ చట్టంలో పేర్కొన్న జరిమానాలతో పాటు నేరం తీవ్రతను బట్టి చర్యలు తీసుకుంటామని అల్ మజ్రోయీ వివరించారు.
వాహనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సంబంధించిన 2023 డిక్రీ నెం. 30 ప్రకారం, ఉల్లంఘించినవారు Dh50,000 వరకు విడుదల రుసుము చెల్లించవలసి ఉంటుందని అల్ మజ్రోయి చెప్పారు. బాధ్యతా రహితమైన డ్రైవింగ్ పద్ధతులకు వ్యతిరేకంగా దుబాయ్ పోలీసులు పదేపదే హెచ్చరిస్తున్నారని, అయినా కొందరిలో మార్పులు రావడం లేదని అన్నారు. కొంతమంది డ్రైవర్లు అటువంటి ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉంటారని, అలాంటివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్‌లో అందుబాటులో ఉన్న "పోలీస్ ఐ" సేవ ద్వారా లేదా "వి ఆర్ ఆల్ పోలీస్" హాట్‌లైన్ 901కి కాల్ చేయడం ద్వారా ఫిర్యాదులు చేసి దుబాయ్ పోలీసులకు సహకరించాలని అల్ మజ్రూయి ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







