డిసెంబరు 20న సుహార్ లో సముద్రపు ఒడ్డున 8k వాక్ ఈవెంట్

- December 18, 2024 , by Maagulf
డిసెంబరు 20న సుహార్ లో సముద్రపు ఒడ్డున 8k వాక్ ఈవెంట్

సొహార్: నడక అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సాధారణ వ్యాయామం. ఇది శరీరానికి తక్కువ ఒత్తిడిని కలిగిస్తూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నడక వల్ల రక్తపోటు తగ్గి, రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రోజూ నడవడం వల్ల కండరాలు బలపడతాయి, ఎముకలు పటిష్టంగా మారతాయి. మానసిక ఆరోగ్యానికి కూడా నడక ఎంతో మేలు చేస్తుంది. ఉదయం లేదా సాయంత్రం నడవడం వల్ల శరీరానికి తగినంత వ్యాయామం లభిస్తుంది. క్రమంగా నడకను అలవాటు చేసుకుంటే, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. నడకను రోజువారీ జీవితంలో భాగం చేసుకోవాలని ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందడానికి సుహార్ వాక్ యొక్క నిర్వాహక కమిటీ, 4వ సుహార్ వాక్ ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా సుహార్ వాక్ యొక్క నిర్వాహక కమిటీ సభ్యుడు మహమ్మద్ సమీ మాట్లాడుతూ
సుహార్ వాక్ డిసెంబర్ 20, 2024న సుహార్ లో సముద్రపు ఒడ్డున ప్రారంభం అయ్యే ఈ ఈవెంట్ కు అందరూ ఆహ్వనితులే అని తెలిపారు. ఇంకా ఈ వాక్ ఉదయం 6:30 గంటలకు  సుహార్ ప్రాంతంలోని సువైహిరా నుండి ప్రారంభమై సుహార్ కోట వద్ద ముగుస్తుంది. మొత్తం 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాక్ ప్రారంభంలో అల్పాహారం, నీరు మరియు రసాలు అందించబడతాయి. ఇంకా వాక్ మొత్తం నీరు మరియు రసాలు అందుబాటులో ఉంటాయి. అలాగే వాక్ ముగింపు పాయింట్ నుండి తిరిగి ప్రారంభ పాయింట్ కు రవాణా అందుబాటులో ఉంటుంది.

వాక్ సమయంలో వైద్య బృందం అందుబాటులో ఉంటుంది. ఈ వాక్ అన్ని వయసుల మరియు వర్గాల వారికి అందుబాటులో ఉంటుంది. మహిళల కోసం ప్రత్యేక వాక్ కూడా ఉంటుంది. People of Determination కోసం ప్రత్యేక వాక్ ఉంటుంది.
ఈ కార్యక్రమానికి మీడియా కవరేజ్ ఉంటుంది. జట్లు మరియు వ్యక్తిగతంగా పాల్గొనేవారికి ముందస్తుగా వసతి ఏర్పాటు చేయవచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొనే అందరినీ గౌరవిస్తాము. వాక్ లో పాల్గొన్నవారికి ప్రత్యేక బహుమతులు కూడా ఉంటాయనీ సుహార్ వాక్ యొక్క నిర్వాహక కమిటీ సభ్యుడు మహమ్మద్ సమీ తెలిపారు.

రిజిస్ట్రేషన్ నమోదు: 4వ సుహార్ మెరైన్ వాక్ లో వ్యక్తిగతంగా లేదా జట్టుగా పాల్గొనడానికి, క్రింది లింక్ ను ఉపయోగించి నమోదు చేసుకోండి:
https://forms.gle/RPnvJ9N4zFDVfH6o8

వాట్సప్ గ్రూప్ లో చేరండి: ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా సమాచారం కోసం, అధికారిక WhatsApp గ్రూప్ లో చేరడానికి ఈ లింక్ ను ఉపయోగించండి:
https://chat.whatsapp.com/F7cTEe6Pn9GFyLMXgcQWMF

ప్రారంభ పాయింట్లు:
ప్రధాన మార్గం (8 కిలోమీటర్లు):
https://maps.app.goo.gl/U3BveSNBbTGzERdF6?g_st=ic

చిన్న మార్గం (3 కిలోమీటర్లు):
https://maps.app.goo.gl/eBnUS3dsb9mRXKiE8?g_st=ic

ప్రత్యేక మార్గం (500 మీటర్లు) - People of Determination కోసం:
https://maps.app.goo.gl/KCNKDkgdpDTQ36R16?g_st=ic

నాల్గవ సుహార్ వాక్ లో పాల్గొనే మీకు మరింత సమాచారం కావాలంటే, దయచేసి 96999908 నంబర్ కు సంప్రదించండి. మీకు ఈ వాక్ లో పాల్గొనడం ద్వారా ఒక మంచి అనుభవం కలుగుతుందని ఆశిస్తున్నాము. ఈ వాక్ ద్వారా మీకు ఆరోగ్యకరమైన మరియు ఆనందకరమైన రోజు కావాలని కోరుకుంటున్నాము.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com