సూపర్ స్టార్ క్షేమంగా ఉన్నారు: సత్యనారాయణ
- June 27, 2016
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ క్షేమంగా ఉన్నారని ఆయన సోదరుడు సత్యనారాయణ వెల్లడించారు. రజనీకాంత్ ఆరోగ్యం దెబ్బతినడానికి ఆయన సోదరుడు సత్యనారాయణే కారణమని తమిళనాడులో పలు చోట్ల పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్యనారాయణ స్పందిస్తూ అన్నయ్య మెడికల్ టెస్ట్‌ల కోసం యూఎస్‌కు వెళ్లారు. కబాలి సినిమా రిలీజ్‌కు ముందే ఆయన యూఎస్ నుంచి తిరిగొస్తారని స్పష్టం చేశారు. అన్నయ్య ఇటీవలే యునెస్కో చారిత్రక ప్రదేశంలోని శివాలయంలో పూజలు చేశారని తెలిపారు. ప్రజలు, అభిమానులు ఆయనపై చూపిస్తున్న ప్రేమ, అభిమానానికి తమ కుటుంబం పట్ల ఎప్పటికీ రుణపడి ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







