19 ఏళ్ల తర్వాత రియల్ ప్రాజెక్ట్ 'అండర్ క్యాన్సిలేషన్’..షాక్‌లో ఇన్వెస్టర్లు..!!

- December 20, 2024 , by Maagulf
19 ఏళ్ల తర్వాత రియల్ ప్రాజెక్ట్ \'అండర్ క్యాన్సిలేషన్’..షాక్‌లో ఇన్వెస్టర్లు..!!

దుబాయ్: 19 ఏళ్ల నిరీక్షణ తర్వాత రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ 'అండర్ క్యాన్సిలేషన్' కావడంతో నివాసితులు, పెట్టుబడిదారులు షాక్‌లో ఉన్నారు.వందలాది మంది ప్రాపర్టీ కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్ట్ తర్వాత తమ పెట్టుబడిని కోల్పోతారనే భయంతో ఉన్నారు. 19 సంవత్సరాల క్రితం 2005లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును, ఇటీవల దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ చేత "అండర్ క్యాన్సిలేషన్" గప్రకటించింది.

దుబాయ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పార్క్ (డిఐపి)లోని దుబాయ్ లగూన్ సైట్‌లోని లిల్లీ జోన్‌లోని తన కలల ఇంటిని చూడాలని 17 సంవత్సరాలుగా దుబాయ్ నివాసితులు ఎదురుచూస్తున్నారు. వీరందరూ 2007లో ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టారు. స్కోన్ ప్రాపర్టీస్ ద్వారా ప్రారంభించబడిన దుబాయ్ లగూన్ 4,166 యూనిట్లతో 53 మిడ్-రైజ్ భవనాలను కలిగి ఉంది. ఇది స్టూడియోల నుండి నాలుగు పడక గదుల అపార్ట్‌మెంట్ల వరకు అనేక ఎంపికలను కలిగి ఉంది. మార్చి 2006లో ప్రాజెక్ట్ మొదటి దశ ప్రారంభించిన 54 రోజుల తర్వాత పూర్తిగా విక్రయించినట్టు ప్రకటించారు. మొదటి దశ నిర్మాణాన్ని సెప్టెంబర్ 2007 నాటికి పూర్తి చేసి 2008 నాటికి అప్పగించాలని నిర్ణయించారు.

దుబాయ్ లగూన్, 5.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణం, జోన్‌లుగా విభజించారు. 2008 ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభావితమైన అనేక రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ఇది ఒకటి అని మార్కెట్ రియల్ నిపుణులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com