#NKR21 నుంచి ఈవిల్డోర్ గా సోహైల్ ఖాన్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్
- December 20, 2024నందమూరి కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ యాక్షన్ థ్రిల్లర్ #NKR21 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ హై-ఆక్టేన్ మూవీ యాక్షన్, ఎమోషనల్ డెప్త్ బ్లెండ్ తో ఉండబోతోంది. ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న #NKR21 ప్రేక్షకులకు థ్రిల్లింగ్ రైడ్ ఇవ్వబోతోంది.
పుట్టినరోజును పురస్కరించుకుని ఈ చిత్రంతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్న సోహైల్ ఖాన్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. స్టన్నింగ్ పోస్టర్‌లో సొహైల్ ఖాన్ బ్లాండ్ అండ్ బ్లాక్ లో గ్లాసెస్ ధరించి స్టైలిష్ పవర్ ఫుల్ ప్రెజన్స్ తో కనిపించారు. ఈవిల్డోర్ గా అతని పాత్ర హైలైట్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరోతో పేస్ అఫ్ రివర్టింగ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుండగా, కళ్యాణ్ రామ్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తుండగా, శ్రీకాంత్, సాయి మంజేరకర్, యానిమల్ పృథ్వీవీరాజ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్ కాగా, అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్, శ్రీకాంత్ విస్సా స్క్రీన్ ప్లే అందించారు.
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీవీరాజ్ & తదితరలు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
డీవోపీ: రామ్ ప్రసాద్
బ్యానర్లు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్
ఎడిటర్: తమ్మిరాజు
సమర్పణ: ముప్పా వెంకయ్య చౌదరి
స్క్రీన్ ప్లే: శ్రీకాంత్ విస్సా
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
యాక్షన్: రామకృష్ణ, పీటర్ హెయిన్
పీఆర్వో: వంశీ-శేఖర్, వంశీ కాకా
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







