బహ్రెయిన్ లో 6,390 మంది ప్రవాసుల నియామకం..!!
- December 22, 2024
మనామా: బహ్రెయిన్ ప్రభుత్వ రంగంలో 6,390 ప్రవాసులను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ప్రధానంగా ఆరోగ్యం, విద్య రంగంలో నియామకాలు చేపట్టినట్టు సివిల్ సర్వీస్ బ్యూరో (CBS) వెల్లడించింది. అర్హత కలిగిన బహ్రెయిన్లు అందుబాటులో లేకపోవడంతో నైపుణ్యం గల ప్రవాసులను నియమించారు. జాబ్ పోర్టల్‌లో లేదా ఎలక్ట్రానిక్ రిక్రూట్మెంట్ సిస్టమ్ ద్వారా ఖాళీలను ప్రకటించిన తర్వాత మాత్రమే ప్రవాసులను నియమించుకుంటారని బ్యూరో వెల్లడించింది.
3,525 మంది ప్రవాసులు విద్య రంగంలో, 2,157 మంది హెల్త్‌కేర్‌లో, 417 మంది ఇంజనీరింగ్‌లో, 231 మంది టెక్నికల్ రోల్స్‌లో.. 60 మంది కన్సల్టెన్సీలో తాత్కాలిక కాంట్రాక్టులపై పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విధానం వల్ల సిబ్బంది డిమాండ్లకు అనువుగా స్పందించేందుకు వీలు కల్పిస్తుందన్నారు.
పార్లమెంటరీ ఇన్వెస్టిగేటివ్ కమిటీకి జనవరి బ్రీఫింగ్లో ప్రభుత్వ సంస్థలు సమర్పించిన ఉపాధి ఒప్పందాలను బ్యూరో పరిశీలించింది. 2020 నుండి 1,227 కంటే తక్కువ ఒప్పందాలు కుదిరాయని, ఒప్పందాలను ఖరారు చేసే బాధ్యత ఎంటిటీలపైనే ఉంటుందని పేర్కొన్నారు. జామ్ మార్కెట్ అంతరాలను తగ్గించడాని, అత్యవసర సిబ్బంది డిమాండ్లను నిర్వహించడానికి, బ్యూరో బహ్రెయిన్ ప్రైవేట్ రంగ సంస్థలకు కూడా అనుమతి ఇచ్చింది. 2020 - 2023 మధ్య 16 ఒప్పందాలను ఆమోదించింది. ఈ ఒప్పందాలు ఐటీ మద్దతు, కస్టమర్ సేవ, హౌజ్ కీపింగ్ సహా అనేక రకాల సేవలను కవర్ చేస్తాయని సివిల్ సర్వీస్ బ్యూరో డేటా వెల్లడించింది.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్‌లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









