మొటిమల్ని అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు..
- June 27, 2016
అ మ్మాయిలు ఎక్కువగా ఇబ్బందిపడే సమస్యల్లో మొటిమలు ప్రధానమైనవి. హార్మోన్ సమస్యలతో పాటు జిడ్డు ఎక్కువగా పేరుకోవడం, కాలుష్యం వంటివి దీనికి కారణాలు
కావొచ్చు. మరి ఈ సమస్యను అదుపులో ఉంచుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.
*
తరచూ చల్లటి నీళ్లతో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. బొప్పాయి గుజ్జులో కాసిని పాలు, కాస్త సెనగపిండి కలిపి ముద్దలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ కాలేజీ నుంచి ఇంటికి తిరిగిరాగానే ముఖానికి రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి తొలగిపోతుంది.
*
దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాని చంపేస్తాయి. రెండు చెంచాల తేనె, చెంచా పాలు కలిపి... దానికి చెంచా దాల్చిన చెక్కపొడి చేర్చాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి పావు గంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి.
*
అరటిపండు తొక్కని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమానికి రెండు చెంచాల తేనె, అరచెక్క నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పావుగంటయ్యాక కడిగేసుకుంటే మొటిమల సమస్య అదుపులోకి వస్తుంది. అరటిపండు తొక్కలో ల్యూటిన్ అనే ఎంజైము ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేందుకు సాయపడుతుంది
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







