టర్కీయేలో బస్సులో మంటలు..35 మంది సౌదీ పర్యాటకులకు తప్పిన ప్రమాదం..!!
- December 25, 2024
ఇస్తాంబుల్: టర్కీయేలో టూరిస్ట్ బస్సులో మంటలు చెలరేగిన ఘటనలో 35 మంది సౌదీ పర్యాటకుల బృందం తృటిలో తప్పించుకున్నారు. టర్కీ మీడియా ప్రకారం.. పర్యాటకులు సోమవారం సాయంత్రం గెబ్జే-ఓర్హంగజీ-ఇజ్మీర్ మోటర్‌వేలో బుర్సా నుండి ఇస్తాంబుల్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. 41 ఏళ్ల బస్సు డ్రైవర్ బస్సు జెమ్లిక్ బ్రిడ్జ్ దగ్గరకు చేరుకున్నప్పుడు ఇంజిన్ నుండి భారీగా పొగలు కమ్ముకోవడం గమనించాడు. మంటలు బస్సును చుట్టుముట్టకముందే ప్రయాణికులను బస్సు నుండి సురక్షితంగా దించివేశారు. దాంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. బస్సు డ్రైవర్ నుంచి సమాచారం అందుకున్న టర్కీ భద్రతా అధికారులు వెంటనే స్పందించారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి టర్కీ భద్రతా అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం సౌదీ పర్యాటకులను మరో బస్సులో ఇస్తాంబుల్‌కు తరలించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?







