హైదరాబాద్ లో మెగా జాబ్ ఫెయిర్....

- December 25, 2024 , by Maagulf
హైదరాబాద్ లో మెగా జాబ్ ఫెయిర్....

హైదరాబాద్: ఉద్యోగాల సాధనలో శ్రమిస్తున్న యువతి, యువకులకు శుభవార్త! ఈ నెల డిసెంబర్ 28, 2024న హైదరాబాద్ నగరంలోని తెలంగాణ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. Merit Maxx Healthcare 24/7 Tech సహాయ సహకారాలతో భాగ్యనగర నగర ప్రముఖుడు  మన్నన్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళాను ముఖ్య అతిథిగా హాజరవుతున్న ప్రముఖ వ్యాపారవేత్త మరియు సామాజికవేత్త డాక్టర్ వినయ్ సరికొండ  ప్రారంభించనున్నారు.ఈ జాబ్ మేళాలో దేశంలో ఉన్న పలు MNC కంపెనీలు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కంపెనీలు మొత్తం 72 కంపెనీలు పాల్గొనబోతున్నాయి. Pharma, Banks, Healthcare,  IT& ITes firms, Education, Hospitality, Automobile industry, Sales & Marketing రంగాలకు చెందిన ఈ కంపెనీల్లో ఉన్న పలు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి, అభ్యర్థులకు నియామక పత్రాలను అందిస్తారు. జాబ్ మేళాలో పాల్గొనడానికి కనీస విద్యార్హత 10వ తరగతి. ఈ మేళాలో దేశవ్యాప్తంగా ఉన్న యువతి, యువకులు పాల్గొనవచ్చు. ఉద్యోగాల ఎంపికలో మహిళా అభ్యుదయానికి ప్రాధాన్యతనిస్తూ యువకులకంటే యువతులకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇక్కడ ఇంటి దగ్గర నుంచి పనిచేసే ఉద్యోగ అవకాశాలు సైతం ఉన్నాయి. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇప్పటి వరకు మన్నన్ ఖాన్, వినయ్ సరికొండ  సంయుక్తంగా 21 వేలకు పైగా ఉద్యోగాలను ఇప్పించారు.ఈ తెలంగాణ జాబ్ మేళా ద్వారా 1000 మందికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ గా MAA GULF news వ్యవహరించనున్నది.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని యువత జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగాలతో తిరిగి వెళ్ళండని నిర్వాహుకులు తెలుపుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com