నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటే ఈ సమస్యలు మటుమాయం...!
- December 27, 2024
చలికాలమైనా, ఏ కాలమైనా కొన్నిసార్లు ఎక్కువగా తినడం, ఇతర కారణాల వల్ల గ్యాస్, అసిడిటీ, కడుపులో భారంగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడు చాలా మంది గోరువెచ్చని నీరు తాగడం, హెర్బల్ టీ తీసుకుంటుంటారు. వీటి వల్ల సమస్య పరిష్కారమైనప్పటికీ వీటికంటే ఎక్కువగా పనిచేసే ఆయుర్వేద టిప్ ఒకటి ఉంది.
ఇది జీర్ణక్రియని పెంచుతుంది. అన్ని సమస్యల్ని దూరం చేస్తుంది. ఇవి కడుపు సంబంధిత సమస్యల్ని దూరం చేయడమే కాదు.. ఇమ్యూనిటీని, జీవక్రియని పెంచి చాలా సమస్యల్ని దూరం చేస్తుంది.నెయ్యి, బెల్లాన్ని కలిపి తీసుకుంటే శరీరంలో చాలా సమస్యలు దూరమవుతాయి. ఆయుర్వేద ప్రకారం, ఈ రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా మారి జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
నెయ్యి, బెల్లం కలయిక లివర్ పనితీరుకి కూడా చాలా మంచిది. నెయ్యి లివర్ పనితీరుని పెంచగా.. బెల్లంలో డీటాక్సీఫై గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లివర్‌కి మేలు చేస్తాయి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. లివర్‌కి ఎలాంటి సమస్యలొచ్చినా దూరమవుతాయి.
నెయ్యిలో విటమిన్ కె2 ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. దీని వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో పిల్లలు, పెద్దవారికి కూడా ఈ రెమిడీ చాలా మంచిది.
నెయ్యిలో హెల్దీ ఫ్యాట్స్, ఫ్యాట్ సోల్యూబుల్ విటమిన్స్ అంటే ఏ, ఈ, డీలు ఉంటాయి. బెల్లంలో మినరల్స్ అయిన ఐరన్, మెగ్నీషియం, పొటాషియంలు ఉంటాయి. వీటిని రెండు కలిపి తీసుకున్నప్పుడు బాడీకి అదనపు పోషకాలు అందుతాయి. ఇవి భోజనం చేశాక తీసుకోవడం మంచిది.
ఆయుర్వేదం ప్రకారం బెల్లం, నెయ్యి కలయిక రెండూ కూడా బాడీలోని వాత, పిత్తా, కఫా దోషాలను దూరం చేస్తాయి. ఈ రెండింటి కలయిక పోషకాలని అందిస్తాయి. ఇవి శరీరంలోని సమస్యల్ని దూరం చేయడంలో బాగా పనిచేస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
రోజూ కూడా హాఫ్ స్పూన్ బెల్లం, హాఫ్ స్పూన్ నెయ్యి కలిపి తీసుకుంటే మలబద్దకం వంటి సమస్యలు దూరమవుతాయి. గట్ ప్రాబ్లమ్స్‌కి కూడా చెక్ పెట్టొచ్చు. దీనికి కారణం బెల్లంలోని ఫైబర్, ఎసెన్షియల్ పోషకాలే. ఇది నెయ్యితో కలిసినిప్పుడు లాక్సేటివ్ గుణాలు కలిసి కడుపుకి సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి. ముఖ్యంగా, మలబద్ధకం తగ్గుతుంది.
నెయ్యిలో కడుపుని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. దీని వల్ల మనం హెవీ, స్పైసీగా ఏమైనా తిన్నప్పుడు దీనిని తీసుకోవడం వల్ల హెల్ప్ అవుతుంది. బెల్లంలో నేచురల్ స్వీట్‌నెస్ ఉంటుంది. దీని వల్ల జీర్ణ వ్యవస్థని శాంతి పరుస్తుంది.
నెయ్యిలో హెల్దీ ఫ్యాట్స్ ఉన్నాయి. వీటిని వల్ల షుగర్‌ని అబ్జార్బ్ చేసే ప్రాసెస్ మెల్లిగా మారుతుంది. దీంతో ఒకేసారి షుగర్ లెవల్స్ పెరగవు. ఇది షుగర్ ఉన్నవారికి చాలా మంచిది.అయితే, ఈ రెండింటి వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ, వీటిని తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. నెయ్యి, బెల్లం రెండూ కూడా కేలరీలను కలిగి ఉంటాయి. కాబట్టి, వీటిని తీసుకునే ముందు మీరు డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్‌లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్‌లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్‌కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!