'సంక్రాంతికి వస్తున్నాం'లో సంక్రాంతి స్పెషల్ సాంగ్ పాడిన విక్టరీ వెంకటేష్
- December 27, 2024
విక్టరీ వెంకటేష్ 'గురు' సినిమాలో తన ఎనర్జిటిక్ వోకల్స్ తో పాడిన జింగిడి జింగిడి సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి సింగర్ గా అలరించబోతున్నారు వెంకటేష్. ఈ సారి, సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానున్న తన మోస్ట్ అవైటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' లోని ట్రాక్‌కి తన వాయిస్‌ని అందిస్తున్నారు.
రీసెంట్ గా బిహైండ్ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, నిర్మాత శిరీష్, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ ఎక్సయిటింగ్ డెవలప్మెంట్ ని రివిల్ చేశారు.
మొదట్లో ఈ సినిమా స్పెషల్ ఫెస్టివల్ ట్రాక్ కోసం ప్రముఖ బాలీవుడ్ సింగర్‌ని తీసుకురావాలని అనిల్ రావిపూడి ప్లాన్ చేశారు. అయితే వెంకటేష్ తనకు అలవాటైన చార్మ్ తో ఆ పాటను తానే పాడాలనే కోరికను వ్యక్తం చేశారు. వెంకటేష్ ఉత్సాహంగా అవకాశాన్ని కోరడం, అనిల్ రావిపూడి అంగీకరించడం వీడియోలో ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేశారు.
'సంక్రాంతికి వస్తున్నాం'లోని ఈ వైబ్రెంట్ ఫెస్టివల్ ట్రాక్ ప్రస్తుతం RFCలో చిత్రీకరణజరుగుతోంది.ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు వైరల్ హిట్స్ గా నిలిచి ఇప్పటికే ప్రేక్షకులను అలరించాయి, ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ సాంగ్ కోసం క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ హై ఎనర్జీ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రాఫర్.
వెంకటేష్ ఎక్స్ పోలీసు ఆఫీసర్ గా, ఐశ్వర్య రాజేష్ అతని భార్యగా, మీనాక్షి చౌదరి అతని ఎక్స్ లవర్ గా నటిస్తున్నారు.
దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించగా, ఎ.ఎస్.ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను పర్యవేక్షిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్‌ను నిర్వహిస్తుండగా, ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ స్క్రీన్‌ప్లేను రూపొందించారు. ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలకు వి వెంకట్ కొరియోగ్రఫీ అందించారు.సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







