'చుట్టాలబ్బాయి' చిత్రం ఆడియో విడుదల జులై 16న ..
- June 28, 2016
ఆది కథానాయకుడిగా రూపుదిద్దుకుంటున్న 'చుట్టాలబ్బాయి' చిత్రం ఆడియో విడుదల వేడుకను జులై 16న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆది తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలుపుతూ పీఆర్వో ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. వీరభద్రం చౌదరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఆది సరసన నమితా ప్రమోద్ నటించారు. ఆది తండ్రి సాయికుమార్ ప్రత్యేక పాత్రను పోషించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంపై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో రఘుబాబు, పృథ్వి, వంశీకృష్ణ, అభిమన్యు సింగ్, షకలక శంకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







