'ఓం నమోవెంకటేశాయ'. ముహూర్తం షాట్‌ దిగ్విజయం..

- June 28, 2016 , by Maagulf
'ఓం నమోవెంకటేశాయ'. ముహూర్తం షాట్‌ దిగ్విజయం..

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, అక్కినేని నాగార్జున, కీరవాణి కాంబినేషన్లో ఇప్పటికి మూడు భక్తిరస చిత్రాలు విడుదలయ్యాయి. వీరి కలయికలో వస్తున్న నాల్గో చిత్రం 'ఓం నమోవెంకటేశాయ'. ఈ చిత్రం ముహూర్తం షాట్‌ దిగ్విజయంగా మొదలైందని రాఘవేంద్రరావు సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారి సమక్షంలో నాగార్జున, పూజారులు తదితరులతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. 'ఓం నమో వెంకటేశాయ 25వ తారీఖున ముహూర్తం షాట్‌ దిగ్విజయంగా మొదలైంది. నేను నమ్మే ఆ స్వామి కృప వలన ఇప్పటివరకు నా జీవితంలో చాలా మంచి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక నుంచి కూడా అంతే మంచే జరుగుతుందని, ఆ స్వామి వారి ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయని నా ప్రగాఢ నమ్మకం' అని రాఘవేంద్రరావు పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో అనుష్క, ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికలుగా నటిస్తున్నట్లు సమాచారం.v

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com