నిగంబోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి

- December 28, 2024 , by Maagulf
నిగంబోధ్ ఘాట్‌లో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి

న్యూ ఢిల్లీ: భారత ఆర్థిక సంస్కరణల నాయకుడిగా ప్రసిద్ధి చెందిన మన్మోహన్ సింగ్, శనివారం మధ్యాహ్నం న్యూఢిల్లీని నిగంబోధ్ ఘాట్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల సమక్షంలో మన్మోహన్ సింగ్ కుమార్తె ఆయన అంత్యక్రియల చితికి నిప్పంటించారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమైంది. “మన్మోహన్ సింగ్ అమర్ రహే” నినాదాల మధ్య పార్థివ దేహం పూలమాలల వాహనంలో ఊరేగింపుగా వెళ్ళింది.

3, మోతీలాల్ నెహ్రూ రోడ్‌లోని ఆయన నివాసం నుండి AICC ప్రధాన కార్యాలయానికి ఉదయం 9 గంటలకు మన్మోహన్ సింగ్ భౌతికకాయాన్ని తీసుకెళ్లారు.

కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు ఎఐసీసీ కార్యాలయంలో పార్థివ దేహం ముందు నివాళులర్పించారు.

మన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ మరియు కుమార్తెలు కూడా ఆయన భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.

సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వృద్ధాప్య సంబంధిత వైద్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 92 సంవత్సరాలు.

సింగ్ 2004 నుండి 2014 వరకు దేశ ప్రధాని గా పనిచేశారు.మాజీ ప్రధాని గౌరవంగా, కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది. ఈ సందర్భంగా జాతీయ జెండాను సగానికి ఎగురవేయాలని కేంద్రం ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com