యెమెన్‌కు మద్దతుగా $500 మిలియన్ల ఆర్థిక సహాయ ప్యాకేజీ.. సౌదీ అరేబియా
- December 28, 2024
రియాద్: యెమెన్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, యెమెన్ ప్రజల అభివృద్ధిని ప్రోత్సహించడం లక్ష్యంగా యెమెన్‌కు మద్దతుగా సౌదీ అరేబియా $500 మిలియన్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ యెమెన్‌కి $300 మిలియన్ డిపాజిట్ కూడా ఉంది. దాంతో పాటు$1.2 బిలియన్ బడ్జెట్ లోటును పరిష్కరించడానికి అదనంగా $200 మిలియన్లను అందించనుంది. సౌదీ డెవలప్మెంట్ అండ్ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రాం ఫర్ యెమెన్ (SDRPY) ద్వారా నిధులు కేటాయించారు. ఈ సహాయ ప్యాకేజీ స్థిరమైన ఆర్థిక వృద్ధిని నడపడానికి, ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి, జాతీయ ఆర్థిక వ్యవస్థను మరింత స్థిరమైన దిశగా నడిపించడానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. యెమెన్ కోసం సౌదీ డెవలప్మెంట్ అండ్ రీకన్స్ట్రక్షన్ ప్రోగ్రామ్ యెమెన్ అంతటా 263 అభివృద్ధి ప్రాజెక్టులు మరియు కార్యక్రమాలను అమలు చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







