7 కొత్త సెల్ఫ్‌ సర్వీస్‌ మెషీన్లను ప్రారంభించిన ఆర్‌టిఎ

- June 28, 2016 , by Maagulf
7 కొత్త సెల్ఫ్‌ సర్వీస్‌ మెషీన్లను ప్రారంభించిన ఆర్‌టిఎ

దుబాయ్‌ రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, కొత్తగా మరో ఏడు సెల్ఫ్‌ సర్వీస్‌ మెషీన్లను నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఉన్న 10 మెషీన్లకు ఇవి అదనం. డ్రైవింగ్‌ లైసెన్సుల రెన్యువల్‌, సీజనల్‌ పార్కింగ్‌ పర్మిట్‌, అలాగే వాహన రిజిస్ట్రేషన్లను ఈ మెషీన్ల ద్వారా నిర్వహించుకోవచ్చు. 2013లో ఫెతాటి బ్రాండ్‌తో ఏర్పాటైన ఈ మెషీన్ల ద్వారా 60,869 ట్రాన్సాక్షన్స్‌ పూర్తయ్యాయి. ఆర్‌టిఎ కస్టమర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అహ్మద్‌ మహబూబ్‌ మాట్లాడుతూ, నఫెతాటి ద్వారా సర్వీసులను మరింత మెరుగ్గా అందించాలనుకుంటున్నామనీ, మెషీన్ల వద్దకు వచ్చేవారి సంఖ్య పెరుగుతుండడంతో, వినియోగదారుల సౌకర్యార్థం కొత్త వాటిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉమ్‌ అల్‌ రొమూల్‌, జెబిర్‌, అల్‌ మనార్‌, తస్జీల్‌ అల్‌ మర్షా, క్విక్‌ అల్‌ కుసైస్‌, అమ్మాన్‌ స్ట్రీట్‌, ఇండస్ట్రియల్‌ ఏరియా 3, తస్జీల్‌ అల్‌ కాసిస్‌, అల్‌ కరామా మరియు అల్‌ తవార్‌ సెంటర్‌ వంటి చోట్ల ఏర్పాటు చేసిన ఈ మెషీన్లు ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com