'లైలా' ఫస్ట్ సింగిల్ సోనూ మోడల్ వీడియో సాంగ్ రిలీజ్
- December 29, 2024
మాస్ కా దాస్ విశ్వక్సేన్ అప్ కమింగ్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' వాలంటైన్ డే కానుకగా ఫిబ్రవరి 14, 2025న విడుదల కానుంది. ఈ చిత్రంలో విశ్వక్సేన్ అబ్బాయిగా, అమ్మాయిగా రెండు క్యారెక్టర్స్ పోషించి తన వెర్సటాలిటీ చూపించబోతున్నారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే స్ట్రయికింగ్ ఫస్ట్ లుక్ టైటిల్ పోస్టర్‌తో దృష్టిని ఆకర్షించింది.
మ్యూజిక్ ప్రమోషన్స్ ని కిక్‌స్టార్ట్ చేస్తూ, మేకర్స్ ఫస్ట్ సింగిల్ సోను మోడల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాట విశ్వక్సేన్ పాత్ర, సోను మోడల్‌ను పరిచయం చేస్తుంది. అతని పర్సోనా పై ఒక గ్లింప్స్ అందిస్తుంది. ఇది సోను చార్మ్, తన ప్రత్యేక స్కిల్స్ తో అమ్మాయిల మనసులని ఎలా గెలుచుకుంటాడో హైలైట్ చేస్తుంది. లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ట్యూన్ ఆకట్టుకునే బీట్లతో మెస్మరైజ్ చేస్తుంది.
ఈ వైబ్ ఏంథమ్ కి విశ్వక్సేన్ స్వయంగా లిరిక్స్ రాస్తూ ఫన్ నంబర్‌కు పర్శనల్ టచ్ జోడించారు. ఈ పాటను సింగర్స్ నారాయణ్ రవిశంకర్, రేష్మా శ్యామ్ ఎనర్జిటిక్ గా పాడారు. విశ్వక్సేన్, ఎనర్జీతో నిండి, తన డైనమిక్ డ్యాన్స్ మూమెంట్స్ ని ప్రజెంట్ చేశారు. లావిష్ గా చిత్రీకరించిన ఈ పాట విజువల్ ఫీస్ట్‌ను అందిస్తుంది. ఈ సాంగ్ చార్ట్‌బస్టర్ బిగినింగ్ తో మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్ కి స్టేజ్ ని సెట్ చేసింది.
ఈ మూవీతో ఆకాంక్ష శర్మ కథానాయికగా అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. వాసుదేవ మూర్తి స్క్రీన్ ప్లే అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్.
నటీనటులు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ
సాంకేతిక సిబ్బంది:
బ్యానర్: షైన్ స్క్రీన్స్
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్
రైటర్: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







