భారత్‌లో డేటాసెంటర్లు ప్రారంభించిన అమెజాన్
- June 28, 2016
ప్రపంచంలోనే అతి పెద్ద క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్లుఎస్) భారత్‌లో మంగళవారం రెండు డేటా సెంటర్లను ప్రారంభించింది. ముంబయిలో రెండు డేటా సెంటర్లను అమెజాన్ వెబ్ సర్వీసెస్ సీఈఓ ఆండీ జాస్సీ ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్‌టీటీలకు పోటీగా అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తోంది. భారత్‌లో డేటా సెంటర్ లేకముందే అమెజాన్ వెబ్ సర్వీసెస్‌కు ఇక్కడ 75వేల మంది యాక్టివ్ వినియోగదారులు ఉన్నారని.. డేటా సెంటర్ల ప్రారంభంతో వినియోగదారుల సంఖ్య బాగా పెరుగుతుందని ఆండీ అన్నారు. అయితే డేటా సెంటర్లపై ఎంత పెట్టుబడి పెట్టారనే ప్రశ్నకు ఆండీ సమాధానమివ్వడానికి నిరాకరించారు. మైక్రోసాఫ్ట్ గత ఏడాదే భారత్‌లో మూడు చోట్ల క్లౌడ్ డేటా సెంటర్లు ప్రారంభించింది. ఐబీఎం చె ్నేైలో డేటా సెంటర్ తెరిచింది. తాజాగా అమెజాన్ వీటిని ప్రారంభించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







