యూఏఈ రోడ్లపై అదనంగా టోల్స్
- June 28, 2016
దుబాయ్ రోడ్లపై అదనంగా టోల్స్ ఏర్పాటు చేసే దిశగా సమాలోచనలు జరుగుతున్నాయి. ఫెడరల్ అథారిటీ ఫర్ ల్యాండ్ అండ్ మెరిటైమ్ ట్రాన్స్‌పోర్ట్ వర్క్‌షాప్‌లో ఈ విషయమై చర్చ జరిగింది. ఈ సందర్భంగా 34 ప్రపోజల్స్ స్థానిక ప్రభుత్వ శాఖల నుంచి అందాయి, ట్రాఫిక్‌ని రెగ్యులేట్ చేసే విషయమై. ట్రాఫిక్ సమస్యల్ని తగ్గించడానికి టోల్స్‌ని కొత్తగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన అందులో ఒకటి. అయితే ఈ ప్రతిపాదన 2008లోనే కార్యరూపం దాల్చింది. తద్వారా సాలిక్ టోల్ గేట్స్‌ని ఏర్పాటు చేశారు. తర్వాత వాటిని అల్ బర్షా, అల్ గర్‌హౌడ్ బ్రిడ్స్, అల్ మక్తౌమ్ బ్రిడ్స్, అల్ మంజార్, అల్ సఫా, దుబాయ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ సమస్యలతో ప్రయాణీకుల సమయంతోపాటు డబ్బు కూడా వృధా అవుతోంది. 2013లో దుబాయ్ ట్రాఫిక్ కారణంగా కిలోమీటర్‌కి 771,148.388 దిర్హామ్‌లు ఒక్కో కిలోమీటర్‌కి ఫ్యూయల్ మరియు, టైమ్ లాస్ నష్టం ఏర్పడింది. ఆర్‌టిఎ అంచనాల ప్రకారం దుబాయ్ ఎకానమీ 2.9 బిలియన్ సెట్ బ్యాక్ అయ్యిందనీ, వర్కింగ్స్ అవర్స్‌ని కోల్పోవడం, అలాగే ఇంధన వృధా వంటివాటిని లెక్కగట్టి, ఈ అంచనాలు వేశారు. 1.39 మిలియన్ వెహికిల్స్ దుబాయ్‌లో రిజిస్టర్ కాగా, ట్రాఫిక్ కాస్ట్ ఒక్కో వాహనానికి 2,086 దిర్హామ్‌లు అని తేల్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







