ఒమన్ జియోలాజికల్ హెరిటేజ్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- December 31, 2024
ఒమన్: ఒమన్ జియోలాజికల్ హెరిటేజ్ ఎగ్జిబిషన్ నాల్గవ ఎడిషన్ దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లోని విలాయత్ ఆఫ్ అ'రుస్తాక్‌లోని అల్ హజ్మ్ ఫోర్ట్‌లో ప్రారంభమైంది. ఇది జూన్ 2025 చివరి వరకు కొనసాగుతుంది. సౌత్ అల్ బతినా గవర్నర్ కార్యాలయం, పెట్రోలియం డెవలప్‌మెంట్ ఒమన్, జియోలాజికల్ సొసైటీ ఆఫ్ ఒమన్ సహకారంతో హెరిటేజ్ టూరిజం మంత్రిత్వ శాఖ ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తుంది. వివిధ గవర్నరేట్‌లలో పర్యాటక, వారసత్వ గమ్యస్థానాల వివరాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు.
ఒమన్‌లో భౌగోళిక వారసత్వం, ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి, దానిని సంరక్షించడానికి హెరిటేజ్ టూరిజం మంత్రిత్వ శాఖ అమలు చేసిన ప్రయత్నాలను సౌత్ అల్ బతినా గవర్నర్ మసౌద్ సెయిడ్ అల్ హషిమి అభినందించారు
ప్రదర్శనలో సుమారు 800 మిలియన్ సంవత్సరాల నాటి శిలాజం, అంతరించిపోయిన ఆదిమ ఏనుగు త్రీడి నమూనాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. వీటితోపాటు ఏసీబ్‌లోని విలాయత్‌లోని అల్ ఖౌద్‌లో గుర్తించిన అంతరించిపోయిన డైనోసార్ నమూనా, దాని శిలాజ ఎముకల అవశేషాలు, ఇతర ప్రత్యేకమైన భౌగోళిక శిలాజాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్‌బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్‌లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









