దుబాయ్ లో మహిళకు ఐదేళ్ల జైలు శిక్ష, 50,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- January 02, 2025
దుబాయ్: డ్రగ్స్‌ను ఇతరులకు అందించేలా సహకరించినందుకు ఓ మహిళకు దుబాయ్‌లో ఐదేళ్ల జైలు శిక్ష, 50,000 దిర్హామ్‌ల జరిమానా పడింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆమెను యూఏఈ నుంచి బహిష్కరించాలని కూడా ఆదేశించింది. రెండు సైకోట్రోపిక్ పదార్ధాలు( యాంఫేటమిన్,మెథాంఫేటమిన్) సరఫరా చేసినందుకు దుబాయ్ క్రిమినల్ కోర్ట్ దోషిగా నిర్ధారించింది. ఈ కేసు ఏప్రిల్ 2, 2024లో చోటుచేసుకుంది. దుబాయ్‌లోని సత్వా ప్రాంతంలో ఒక వ్యక్తి డ్రగ్స్ వాడుతున్నాడని దుబాయ్ పోలీసుల యాంటీ నార్కోటిక్స్ విభాగానికి సమాచారం వచ్చింది. అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారించారు. తాను యాంఫేటమిన్, మెథాంఫేటమిన్‌లను తీసుకున్నట్లు అంగీకరించాడు. రెండు పర్యాయాలు సదరు మహిళ నుంచి డ్రగ్స్ తీసుకున్నట్లు తెలిపాడు. ఆ వ్యక్తి నివాసం నుండి నాలుగు క్రిస్టల్ మెత్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







