ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

- January 02, 2025 , by Maagulf
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

అమరావతి: ఏపీలో కేబినెట్ మీటింగ్ ఇంకా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. వెలగపూడిలోని సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఇందులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, సీఎస్ విజయానంద్, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ESI ఆసుపత్రికి ఆమోదం
తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రి పడకలను 100కు పెంచాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. వీటితో పాటు రామాయపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ, కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా ప్లాంట్‌ ఏర్పాటు, ఎస్‌ఐపీబీ అమోదించిన రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు, చిత్తూరు జిల్లాలో హోంశాఖ ఐఆర్‌ బెటాలియన్‌ ఏర్పాటుకు కేటాయించనున్న స్థలంపై చర్చ జరుగుతోందని సమాచారం.

ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణాలకు ఆమోదం
రాజధాని అమరావతిలో రెండు ఇంజినీరింగ్ కాలేజీల నిర్మాణంతో పాటు రూ.2,733 కోట్లతో చేపట్టనున్న పనులకు కేబినెట్ ఓకే చెప్పింది. సీఆర్‌డీఏ 44వ సమావేశంలో నిర్ణయించిన రెండు పనులకు కూడా ఆమోదముద్ర వేసింది. మున్సిపల్‌ చట్టసవరణ ఆర్డినెన్స్‌కు అంగీకారం తెలిపింది. దీంతో భవనాలు, లేఅవుట్‌ల అనుమతుల జారీ బాధ్యత మున్సిపాలిటీలకు కట్టబెట్టినట్లైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com