ఏపీకి రెండు వందేభారత్ రైళ్లు
- January 03, 2025
అమరావతి: భారతదేశంలో వందేభారత్ రైలు ఓ చరిత్ర. పలు సౌకర్యాలతో పాటు నిర్ణిత సమయంలో గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఇందులో భాగంగా త్వరలో ప్రముఖ పుణ్యక్షేత్ర వారణాసికి ఏపీ నుంచి డైరెక్టు రైలు ప్రారంభం కానుంది. అదే విధంగా ఏపీ నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు వస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెల్లడించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్న వందేభారత్ కు అనూహ్య స్థాయి లో డిమాండ్ కనిపిస్తోంది.ఈ క్రమంలో కొత్తగా కోచ్ లను పెంచుతున్నారు. ఇప్పుడు రైల్వే మంత్రి కి అందిన ప్రతిపాదనలతో తెలుగు రాష్ట్రాలకు తొలి విడతలోనే వందేభారత్ స్లీపర్ దక్కనుంది.
ఏపీకి మరిన్ని కొత్త రైళ్లు
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కీలక ప్రకటన చేసారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ త్వరలోనే మరిన్ని కొత్త రైళ్లు ఏపీ నుంచి ప్రారంభం అవుతాయని వెల్లడించారు. అందులో భాగం గా నరసాపురం-వారణాసి మధ్య కొత్త రైలు ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే రైల్వే మంత్రిని కోరినట్లు చెప్పుకొచ్చారు. గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వారణాసి వెళ్లే ప్రయాణీకుల కోసం ఈ రైలు ఏర్పాటు చేయాలని కోరినట్లు వివరించారు. ఈ రైలు అందుబాటు లోకి వస్తే తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి వెళ్లే ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉంటుంద ని మంత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







