కమిషనరేట్ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి: సీపీ సుధీర్ బాబు
- January 03, 2025
హైదరాబాద్: ఈ నూతన సంవత్సరంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నేరాల శాతం తగ్గింపుకు మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన ప్రత్యేక చర్యలలో భాగంగా కమిషనర్ సుధీర్ బాబు రాచకొండ పరిధిలోని డీసీపీలు, ఏడీసీపీలు మరియు ఇతర అన్ని స్థాయిల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నేర పరిశోధనలో ఉపయోగిస్తున్న పలు రకాల టెక్నాలజీ పద్ధతులను మరియు క్షేత్రస్థాయి సిబ్బందికి విధి నిర్వహణ మరింత సులభతరం అయ్యేందుకు ఉపయోగపడే నూతన టెక్నాలజీ గురించి కమిషనర్ చర్చించారు.నేర పరిశోధనలో మరియు విచారణలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని మరియు అందుబాటులోకి వస్తున్న నూతన విచారణ విధానాలను అవలంబించాలని అధికారులకు కమిషనర్ సూచించారు. రాచకొండ పరిధిలోని అన్ని విభాగాల పోలీసు సిబ్బంది నేర విచారణలో నూతన సాంకేతిక వినియోగం పట్ల అవగాహన పెంచుకోవాలని, అందుకోసం ఐటీ సెల్ వారి సహాయాన్ని తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిసిపి సైబర్ క్రైమ్ అరవింద్ బాబు, డిసిపి అడ్మిన్ ఇందిర, ఏసిపి సి.సి.ఆర్.బి రమేష్, ఏసిపి ఐటి సెల్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







