వాహనదారులకు హెచ్చరిక..వీడియో రిలీజ్ చేసిన అబుదాబి పోలీసులు..!!
- January 04, 2025
యూఏఈ: అబుదాబి పోలీస్ ట్రాఫిక్, పెట్రోల్ డైరెక్టరేట్ వాహనదారులను ఎట్టి పరిస్థితుల్లోనూ రహదారి మధ్యలో ఆపవద్దని కోరింది. వాహన దారుల భద్రత, ఇతర రహదారి వినియోగదారుల భద్రతను నిర్ధారించడానికి సమీపంలోని ఎగ్జిట్ కు వెళ్లాలని సూచించింది. తీవ్రమైన ప్రమాదాలను నివారించడానికి, ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ఇది కీలకమని వెల్లడించింది. “సేఫ్ రోడ్” ప్రచారంలో భాగంగా అబుదాబి పోలీసులు.. కంట్రోల్ అండ్ ఫాలో-అప్ సెంటర్‌తో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేసింది.వీడియోలో మినీవ్యాన్ అకస్మాత్తుగా రోడ్డు మధ్యలో ఆగిపోవడం వల్ల ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసారు. రద్దీగా ఉండే రోడ్లపై ట్రాఫిక్ మధ్య వాహనంలో ఉన్నవారు కిందకు దిగి ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. కొద్ది సేపటికే వేగంగా వస్తున్న కారు వ్యాన్ వెనుక భాగాన్ని ఢీకొట్టింది. అయితే, ప్రమాదం తప్పింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు పూర్తిగా రోడ్డుపై దృష్టి పెట్టాలని సూచించింది.
#فيديو | بثت #شرطة_أبوظبي ضمن حملة #درب_السلامة وبالتعاون مع مركز التحكم والمتابعة فيديو لحادث بسبب التوقف في وسط الطريق دون مبرر و #الانشغال_بغير_الطريق . pic.twitter.com/evFmPJzyoZ
— شرطة أبوظبي (@ADPoliceHQ) January 3, 2025
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







