అయ్యో! కియారా కనిపించట్లేదేంటి? ఆ వార్తలకు తెరపడింది..
- January 04, 2025
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ యూనిట్ కూడా ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉంది. ప్రమోషన్స్ కి ఆల్మోస్ట్ ఇందులో నటించిన SJ సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, అంజలి .. స్టార్స్ అంతా హాజరవుతున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ప్రమోషన్స్ లో అంజలి రెగ్యులర్ గా పాల్గొంటుంది కానీ కియారా అద్వానీ మాత్రం ఒక్క టీజర్ లాంచ్ ఈవెంట్లో తప్ప ఇప్పటివరకు ఎక్కడా ప్రమోషన్స్ లో కనపడలేదు. నేడు గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం ముంబైలో గేమ్ ఛేంజర్ ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. ముంబైలో నిర్వహించిన ప్రెస్ మీట్ కి కూడా కియారా హాజరవకపోవడంతో ఈ విషయం మరింత చర్చగా మారింది.
నిన్న మాత్రం బాలీవుడ్ లో కొన్ని ఇంటర్వ్యూలు చరణ్ తో కలిసి ఇచ్చింది కియారా. చరణ్ తో కలిసి కియారా కనపడిన విజువల్స్ నిన్న వైరల్ అయ్యాయి. ఇంత పెద్ద సినిమాకు కియారా ఎందుకు ప్రమోషన్స్ కి రావట్లేదు అని అంతా చర్చించుకుంటున్నారు. కియారాని ప్రమోషన్స్ కి తీసుకురమ్మని ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో మూవీ యూనిట్ ని అడుగుతున్నారు. అయితే కొన్ని బాలీవుడ్ మీడియాలు కియారా హాస్పిటల్ లో ఉందని, ఆరోగ్య సమస్యతో బాధపడుతోందని రాసుకొచ్చారు.
దీనిపై కియారా మేనేజర్ స్పందిస్తూ.. కియారా హాస్పిటల్ లో అడ్మిట్ అవ్వలేదు. తను విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్ల కొద్దిగా విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పినట్టు తెలిపారు. అందుకే ఇవాళ ముంబై ఈవెంట్ కి కూడా హాజరు కాలేదు. దీంతో సాయంత్రం జరిగే గేమ్ ఛేంజర్ ఈవెంట్ కి కూడా కియారా రాదనే తెలుస్తుంది. నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వస్తుండటంతో సినిమాపై మరింత హైప్ వచ్చింది. ఇప్పటికే ట్రైలర్ తో ఇది పొలిటికల్ సినిమా అని చెప్పేసారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







