జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయి...తొందర వద్దు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- January 04, 2025
తిరుమల: తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్ల పంపిణీ కేంద్రాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు.ఈ సందర్భంగా మీడియాతో బీఆర్ నాయుడు మాట్లాడుతూ… వైకుంఠ ఏకాదశి టోకెన్లను జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు.
ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నానని బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ ఈవో శ్యామలారావుతో ఏర్పాట్లపై చర్చించానని చెప్పారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని భక్తులు గుర్తించాలని అన్నారు.10, 11, 12 తేదీల్లోనే స్వామివారిని దర్శించుకోవాలని అనుకోకండని తెలిపారు.
టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోకండని సూచించారు.19వ తేదీ వరకు ఎప్పుడైనా స్వామివారిని దర్సించుకోవచ్చని తెలిపారు.వీఐపీలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదని చెప్పారు.అలిపిరి వద్ద నిర్మిస్తోన్న వైశ్రాయ్ హోటల్ పనుల నిలుపుదల అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







