ఆ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా నారా లోకేష్!
- January 05, 2025
నందమూరి నటసింహం బాలకృష్ణ లేటెస్ట్ ఫిల్మ్ డాకు మహారాజ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్, ఈ రోజు డాకు మహారాజ్ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. బాలయ్య సినిమాల్లో కనిపించేలా కాకుండా సరికొత్త విజువల్స్ తో గ్రాండియర్ గా సూపర్ గా ఉందనే టాక్ అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ప్రేక్షకుల నుండి కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా విజయ్ కన్నన్ సినిమాటోగ్రాఫీ, తమన్ బ్యాగ్రౌండ్, దర్శకుడి బాబీ టేకింగ్ కు ప్రశంసంలు వెల్లువెత్తుతున్నాయి.
కాగా ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ తో డల్లాస్ కాస్త బాలయ్య పురంగా మారింది. ఇక తెలుగుస్టేట్స్ లో డాకు మహారాజ్ రెండు ఈవెంట్స్ ను ప్లాన్ చేస్తున్నారు నిర్మాత నాగవంశీ. అందులో ఒకటి బాలయ్య అడ్డాగా పిలవబడే అనంతపురంలో ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా బలయ్య పెద్ద అల్లుడు, ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిష్టర్, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ రాబోతున్నట్టు తెలుస్తోంది. మామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లుడు రానుండడంతో డాకు మహారాజ్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు భారీగా చేయబోతున్నారట సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్. శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







