దుబాయ్ లో భార్యపై దాడి.. వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!

- January 05, 2025 , by Maagulf
దుబాయ్ లో భార్యపై దాడి.. వ్యక్తికి 3 నెలల జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!

దుబాయ్: దుబాయ్‌లో భార్యపై దాడి చేసినందుకు ఒక వ్యక్తికి మూడు నెలల జైలు శిక్ష, తర్వాత బహిష్కరణ విధించబడింది. ఈ దాడిలో ఆమె చేయి విరిగి మూడు శాతం శాశ్వత వైకల్యానికి గురైంది. ఈ సంఘటన జూలై 1, 2023న జరిగింది. ఆసియన్ జాతీయతకు చెందిన దంపతులు ఇద్దరూ షేక్ జాయెద్ రోడ్డు మీదుగా వెళ్తుండగా, కారు లోపల వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెరగడంతో భర్త తన భార్యపై దాడి చేశు.  బాధితురాలు జులై 5, 2023న తన భర్త తనపై ఎలా దాడి చేశాడో వివరిస్తూ బర్ దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్టోబర్, నవంబర్‌లలో నిర్వహించిన ఫోరెన్సిక్ పరీక్షలు ఆమె వాదనలకు మద్దతుగా నిలిచాయి.  ప్రతివాది తీర్పుపై అప్పీల్ చేసారు.  అప్పీల్ కోర్టులో మొదటి విచారణ జనవరి 13న  జరుగుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com