పిల్లలలో స్టమక్ ఫ్లూ: నివారణకు PHCC నిపుణుల సూచనలు..!!
- January 07, 2025
దోహా: చలికాలంలో అన్ని వయసుల పిల్లలలో జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసే గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసులు పెరుగుతాయి. కారణాలు, లక్షణాలు, నివారణ పద్ధతులు, అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (PHCC) అల్-వాబ్ హెల్త్ సెంటర్‌లోని ఫ్యామిలీ డాక్టర్ డాక్టర్ మనల్ నాస్ర్ వివరించారు. గ్యాస్ట్రోఎంటెరిటిస్ అనేది జీర్ణవ్యవస్థ ఇన్ఫెక్షన్ అని తెలిపారు. దీని ఫలితంగా వాంతులు, విరేచనాలు లేదా రెండు వస్తాయన్నారు. ఇది వైరల్, బ్యాక్టీరియా ద్వారా వస్తుందని తెలిపారు. నోరోవైరస్, రోటావైరస్ వంటి వైరస్లు అత్యంత సాధారణం అని, ముఖ్యంగా రోటవైరస్ పిల్లలలో ఎక్కువగా కనిపిస్తుందన్నారు. ఇది సాధారణంగా కలుషితమైన ఆహారం లేదా డ్రింక్స్, డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా వ్యాపిస్తుంది. ఇది అంటువ్యాధి కాబట్టి.. స్కూల్స్ లలో పిల్లలలో వేగంగా వ్యాప్తి చెందుతుందని డాక్టర్లు తెలిపారు.
చలికాలంలో గ్యాస్ట్రోఎంటెరిటిస్ కేసులు పెరగడానికి గల కారణాల గురించి వివరిస్తూ..వాతావరణంలో మార్పుల కారణంగా ఈ సీజన్‌లో వైరల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్ ఎక్కువగా ప్రబలుతుందని మనల్ నాస్ర్ అభిప్రాయపడ్డారు. చలికాలంలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కూడా ముఖ్యమైన కారణం అన్నారు. గ్యాస్ట్రోఎంటెరిటిస్‌తో బాధపడుతున్న పిల్లలలో నీళ్ల విరోచనాలు అనేది సాధారణ లక్షణంగా కనిపిస్తుందని తెలిపారు. దాంతోపాటు పిల్లలలో తేలికపాటి నుండి అధిక జ్వరం ఉంటుందన్నారు. కొన్నిసార్లు కడుపు నొప్పి, బాధాకరమైన పేగు తిమ్మిరితో పాటు కడుపులో అసౌకర్యంగా ఉంటుందని వివరించారు. వాంతులు తదితర అసాధారణ లక్షణాలు కన్పించగానే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. ప్రతి 10 నుండి 15 నిమిషాలకు చిన్న సిప్స్‌లో పిల్లలకు ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ORS) ఇవ్వడంతో పాటుగా తల్లిపాలను లేదా ఫార్ములా ఫీడింగ్‌ను కొనసాగించడం గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు ఉత్తమమైన చికిత్సలలో ఒకటి అని మనల్ నాస్ర్ పేర్కొన్నారు. పాల ఉత్పత్తులు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలన్నారు. కొన్ని సందర్భాల్లో, వాంతులు ఆపడానికి, అతిసారం నెమ్మదించడానికి మందులతో పాటు ఇంట్రావీనస్ ద్రవాలు అవసరం అవుతాయని పేర్కొన్నారు.
గ్యాస్ట్రోఎంటెరిటిస్‌ను నివారించడానికి పిల్లలకు రోటావైరస్ వ్యాక్సిన్‌ను వేయించాలని సూచించారు. సబ్బుతో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, ఆహారాన్ని సరిగ్గా నిల్వ చేయడం, తల్లిపాలను ప్రోత్సహించడం, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులకు దూరంగా ఉండటంవంటి వాటితో వైరస్ ను నివారించాలని మనల్ నాస్ర్ చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్‌స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









