నెయ్యితో పాటు కలిపి తినకూడని ఆహారాలు ఇవే !
- January 07, 2025
వేడి వేడి అన్నంలో పచ్చడితో పాటు కాస్తా నెయ్యి వేసుకుని తింటే వచ్చే ఆ మజానే వేరు. ఇక, వంటల్లో మంచి ఫ్లేవర్, టేస్ట్ రావడానికి నెయ్యి వాడుతుంటారు. నెయ్యితో చేసిన స్వీట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భలే టెస్ట్ ఉంటాయి. ఇక, చిన్న పిల్లలకు నెయ్యిని తినిపిస్తే మంచిదంటారు పెద్దలు. నెయ్యితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. నెయ్యిలో పోషకాలు మెండుగా ఉంటాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. నెయ్యిలో విటమిన్ ఎ, డి,కె,ఇ, ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అయితే, కొన్ని పదార్థాలను నెయ్యితో కలిపి తినకూడదు. కలిపి తింటే ఆరోగ్యానికి హానికరం. ఆ పదార్థాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఈ రోజుల్లో బుల్లెట్ టీ, బుల్లెట్ కాఫీ గురించి వార్తల్లో ఎక్కువగా వింటున్నాం. అయితే, టీ లేదా కాఫీతో నెయ్యి కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో బాధపడేవారు ఈ కాంబినేషన్‌కి దూరంగా ఉండాలి. ఈ డ్రింక్స్‌లో కెఫిన్ ఉంటుంది. కెఫిన్ నెయ్యిలో ఉండే కొవ్వులో కరిగే విటమిన్‌లతో చర్య జరిపి అసమతుల్యతను కలిగిస్తుంది. కెఫిన్, నెయ్యిలో ఉండే లక్షణాలతో ప్రతి చర్యలు జరపవచ్చు. దీంతో జీర్ణ సమస్యలు కలిగే అవకాశం ఉంది. అందుకే కాఫీ లేదా టీలో నెయ్యి కలిపి తీసుకోకూడదు.
ఆయుర్వేదంలో నెయ్యి, తేనె కలయిక ఆరోగ్యానికి విషం వంటిది అని పరిగణిస్తున్నారు. నెయ్యి, తేనె కలిపి తీసుకోవడం వల్ల టాక్సిన్స్ (విష పదార్థాలు) ఏర్పడతాయి. అవి శరీరానికి హాని చేస్తాయి. టాక్సిన్ ఏర్పడటం వల్ల అసమతుల్యత కలుగుతుంది. దీంతో.. జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పెరుగుతో నెయ్యిని కలిపి అస్సలు తీసుకోకూడదు. ఇది బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్. ఈ కలయిక జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. నెయ్యిలో ఉండే కొవ్వు ఆమ్లాలు, పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్‌తో చర్య జరుపుతాయి. దీంతో పేగులోని మంచి బ్యాక్టీరియాలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది మీ జీర్ణ సమస్యలను పెంచవచ్చు. అందుకే ఈ రెండింటిని కలిపి తీసుకోకూడదంటున్నారు నిపుణులు.
వేడినీటితో నెయ్యి తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణుల అభిప్రాయం. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. వేడి నీటిలో నెయ్యి కలిపి తాగినప్పుడు.. ఫ్రీ రాడికల్స్ ఏర్పడతాయి. ప్రీ రాడికల్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి. దీంతో.. జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. ఇది శరీరంలో మంట, వాపు సమస్యను ప్రోత్సహిస్తుంది. అందుకే, ఈ రెండింటికి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
ముల్లంగి, నెయ్యి కూడా కలిపి తినకూడదు. ఈ రెండూ మిశ్రమ లక్షణాలతో విబేధిస్తాయి. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ముల్లంగిలో ఉండే లక్షణాలు.. కొవ్వులతో కలిపి అసమతుల్యతను ఏర్పర్చవచ్చు. దీంతో.. జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఈ కలయిక వల్ల కడుపులో అసౌకర్యం, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల్ని కలిగిస్తుంది. ఈ రెండు వేర్వేరుగా తింటే ఆరోగ్యానికి మంచిది. కలిపి తినడం వల్ల రెండింటిలో ఉండే పోషకాలు తగ్గుతాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







