రిపోర్టర్ పై రజనీకాంత్ అసహనం..

- January 07, 2025 , by Maagulf
రిపోర్టర్ పై రజనీకాంత్ అసహనం..

హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కూలీ'. ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం థాయిలాండ్ వెళుతున్న రజనీ.. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 'కూలీ' సినిమా విశేషాలను ఆయన పంచుకున్నారు. అయితే, ఓ రిపోర్టర్ సూపర్ స్టార్కు సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్న వేశారు.

దాంతో ఆ రిపోర్టర్పై ఇలాంటి అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తమిళనాడు రాజధాని చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటనను దృష్టిలో ఉంచుకుని విలేకరి... రజనీకాంత్కు మహిళల భద్రతపై ప్రశ్నించారు. దాంతో తనను పాలిటిక్స్ సంబంధిత ప్రశ్నలు వేయొద్దని సూపర్ స్టార్ ఘాటుగా స్పందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com