అరబ్ పార్లమెంట్ అత్యున్నత అవార్డు అందుకున్న కింగ్ హమద్..!!
- January 07, 2025
మనామా: అరబ్ నాయకులకు అరబ్ పార్లమెంట్ అందించే అత్యున్నత గౌరవమైన లీడర్ మెడల్‌ను హిస్ మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అందుకున్నారు. అరబ్ ప్రయోజనాలకు.. ఉమ్మడి అరబ్ చర్యకు మద్దతుగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డును అందుకున్నారు. అల్ సఖిర్ ప్యాలెస్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ అహ్మద్ అల్ యమాహి ఈ అవార్డును హెచ్ఎం రాజుకు అందజేశారు. అరబ్ సమ్మిట్ ప్రస్తుత చైర్ హిస్ మెజెస్టి.. అంతర్జాతీయ ఫోరమ్‌లలో అరబ్ ప్రయోజనాలను రక్షించడంలో.. ఉమ్మడి అరబ్ చర్యను ప్రోత్సహించడం, అరబ్ చట్టసభల మధ్య సంబంధాలను ప్రోత్సహించడంలో అరబ్ పార్లమెంట్ పాత్రను ప్రశంసించారు. తమ దేశాలు, అరబ్ ప్రపంచాన్ని అభివృద్ధి చేయడంలో స్పీకర్, అరబ్ పార్లమెంట్ సభ్యులు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అరబ్ దేశాలతో బహ్రెయిన్ కు బలమైన, చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







