యూపీ, తమిళనాడులో ఉప ఎన్నికలు
- January 07, 2025
న్యూ ఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీలను కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5న పోలింగ్ నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటే ఉత్తరప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మిల్కిపూర్ అసెంబ్లీ స్థానానికి, తమిళనాడులో ఖాళీగా ఉన్న ఈరోడ్ అసెంబ్లీ స్థానానికి కూడా ఫిబ్రవరి 5న పోలింగ్ జరుగుతుందని భారత ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ప్రకటించారు.
ఉప ఎన్నికలు జరిగే ఈ రెండు అసెంబ్లీ స్థానాల ఎన్నికల ఫలితాలను కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే వెల్లడించనున్నట్లు ఈసీ తెలిపింది. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నట్లు పేర్కొంది. ఈ అన్ని ఎన్నికల కోసం జనవరి 10న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. జనవరి 17 వరకు నామినేషన్‌లకు అవకాశం కల్పించనున్నారు. జనవరి 20 వరకు నామినేషన్‌ల ఉససంహరణకు గడువు విధించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







