'గూఢాచారి-2' లో బాలీవుడ్ బ్యూటీ...
- January 07, 2025
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోల్లో అడివి శేష్ ఒకరు. అసలు థ్రిల్లర్ సినిమాలకు పెట్టిన పేరు అడివి శేష్. ఈ కుర్ర హీరో నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా హిట్టే అనే ముద్ర పడిపోయింది. మరీ ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకు ఒక డెఫినేషన్లా మారిపోయాడు. అలాంటి సినిమాలు చేయాలంటే దర్శక, నిర్మాతలు సైతం ముందుగా అప్రోచ్ అయ్యేది అడివిశేష్న. నిజానికి హీరోగా ఆయన నిలబడడానికి ముఖ్య కారణం కూడా థ్రిల్లర్ జానర్ సినిమాలు చేయడం వల్లనే. మాములుగా ఈ జానర్లో హీరోలు భయపడుతుంటారు. సినిమాలు చేయాలంటే ఎందుకంటే కథనంలో కాస్త పట్టు తప్పినా సినిమా రిజల్ట్ ఊహించని విధంగా డిజాస్టర్ అవుతుంది. కాగా అడివి శేష్ తానే స్వయంగా టైట్ స్క్రీన్ప్లేను రాసుకోవడంతో సినిమాలు ఆడుతున్నాయి.ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న గూఢాచారి 2, డెకాయిట్ సినిమాలు కూడా థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్నవే. నిజానికి అడివి శేష్ స్పీడ్తో పాటు.. క్వాలిటీ సినిమాలు చేస్తుంటాడు. ఏడాదికి పక్కా ఒకటి, రెండు రిలీజ్ లు ఉండేలా ప్లాన్ చేసుకుంటుంటాడు.
ఇక గూఢాచారి సీక్వెల్పై ఆడియెన్స్లో ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. అసలు ఏడేళ్ల కిందటే.. గూఢచారి సినిమాను అడివి శేష్ హాలీవుడ్ లెవల్లో ప్రజెంట్ చేశాడు. అప్పుడే ఆ రేంజ్ సినిమా చూపించాడంటే.. ఇప్పుడు ఇంకా సీక్వెల్ ఏ రేంజ్లో చూపించబోతున్నాడో ఊహకు కూడా అందదు. అంతేకాదు కేవలం... ఈ సినిమా స్క్రీప్ట్ మీదనే అడివిశేష్ చాలా నెలలు గడిపాడు. అంటే.. ఏ రేంజ్లో ట్విస్ట్లు రాసుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఈ సినిమా బడ్జెట్.. అడవి శేష్ కెరీర్లో హైయెస్ట్ అని తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి వామిక గబ్బి పోస్టర్ను రిలీజ్ చేశారు. మిషన్లో భాగంగా వామికా, అడివి శేషు సూట్లో ఉండి ఈఫిల్ టవర్ ముందు కనిపిస్తుండటం పోస్టర్లో చూపించారు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, ప్రీ వీడియోలు సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సీక్వెల్ సినిమాలో అడివి శేష్ మరింత స్టైలిష్ యాక్షన్ అవతార్లో చూపిపించబోతున్నట్టు ప్రీ వెర్షన్ అనౌన్స్ మెంట్ వీడియోతో హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా బడ్జెట్ అక్షరాల రూ.100 కోట్లని తెలుస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తెలుగుతో పాటు ఇండియాలోని మేయిన్ లాంగ్వేజెస్ అన్నిటిలో రిలీజ్ కాబోతుంది.
తాజా వార్తలు
- వ్యాపారి ఇంట్లో భారీ చోరీ కేసులో మిస్టరీని ఛేదించిన హైదరాబాద్ పోలీస్
- రంజాన్ మాసంలో ముస్లిం ఉద్యోగులకు వెసులుబాటు!
- మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్..ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
- రోడ్ల విషయమై మంత్రి గడ్కరి ని కలిసిన ఎంపీ బాల శౌరి
- దుబాయ్ లో ది లూప్ ప్రాజెక్ట్..ఎలోన్ మస్క్ తో ఒప్పందం..!!
- కువైట్లో 10 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు..!!
- ఎడారి ప్రాంతాల్లో ఉల్లంఘనలపై కేసులు నమోదు..తనిఖీలు ప్రారంభం..!!
- రియాద్ వేదికగా డిసెంబర్లో గ్లోబల్ ఎయిర్పోర్ట్స్ ఫోరమ్..!!
- ఘోర ప్రమాదం..గ్యాస్ పేలుడుతో కుప్పకూలిన భవనం..!!
- ఫిబ్రవరి 16న మస్కట్లో హిందూ మహాసముద్ర సదస్సు..!!