భారత్ పోల్ పోర్టల్ ను ప్రారంభించిన అమిత్ షా.. ఇక నేరాలు చేసి విదేశాలకు పారిపోవడం అసాధ్యం!
- January 07, 2025
డిజిటల్ ప్రపంచంలో క్రైమ్‌కి హద్దులు చెరిగిపోయాయి. వివిధ దేశాల్లోని సైబర్ నేరగాళ్లు భారత ప్రజలను టార్గెట్ చేస్తున్నారు. అలానే మన దేశంలో నేరాలకు పాల్పడి విదేశాలకు పారిపోతున్న వారు కూడా పెరుగుతున్నారు.
సాధారణంగా ఇలాంటి కేసుల విచారణ చాలా ఆలస్యం అవుతుంది. కానీ ఇకపై అలా ఉండదు. అంతర్జాతీయ నేరాలను భారత్ మరింత సమర్థంగా పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర హెూంమంత్రి అమిత్ షా మంగళవారం 'భారత్ పోల్ (Bharatpol)' పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.
సరిహద్దులు దాటి జరిగే నేరాలను అరికట్టేందుకు భారత్పల్ సిస్టమ్‌ను తీసుకొచ్చామని, ఇది గ్లోబల్ ఇంటర్ఫేస్ అని అమిత్ షా అభివర్ణించారు. ఇదే కార్యక్రమంలో ఆయన 35 మంది సీబీఐ అధికారులకు పోలీసు పతకాలను అందజేశారు.
భారత్పల్ అంటే ఏంటి?
భారత్పల్ అనేది అంతర్జాతీయ నేరాలను మేనేజ్ చేయడంలో భారత లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫారమ్. దీన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) డెవలప్ చేసింది. ఈ పోర్టల్ ద్వారా భారత దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్, 195 సభ్య దేశాలతో అనుసంధానం అవ్వడానికి సహాయం చేస్తుంది. వేగంగా అంతర్జాతీయ సహకారాన్ని పొందే వీలు కల్పిస్తుంది. దీని ఫీచర్లు చూద్దాం.
రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్: భారతీయ ఏజెన్సీలు, అంతర్జాతీయ ఏజెన్సీల మధ్య సమాచార మార్పిడిని వేగవంతం చేస్తుంది.
సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫారమ్: రెడ్ నోటీసులు, ఇతర ఇంటర్ పోల్ హెచ్చరికలు సహా ఇంటర్నేషనల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ రిక్వెస్ట్‌లను త్వరగా ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
స్ట్రీమ్ లైన్డ్ కమ్యూనికేషన్: లెటర్స్, ఇమెయిల్స్, ఫ్యాక్స్ వంటి ట్రెడిషినల్ కమ్యూనికేషన్ పద్ధతులను ఫాస్టెస్ట్ డిజిటల్ సొల్యూషన్స్‌తో రీప్లేస్ చేస్తుంది.
గ్లోబల్ సహకారం: ఇంటర్‌పోల్‌లోని 195 సభ్య దేశాల నుంచి సమాచారాన్ని పంచుకోవడానికి, అభ్యర్థించడానికి కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలకు భారత్పల్ ఉపయోగపడుతుంది.
అంతర్జాతీయ నేరాలకు చెక్: పోర్టల్ ప్రత్యేకంగా సైబర్ క్రైమ్, ఆర్థిక మోసం, మానవ అక్రమ రవాణా, ఆర్గనైజ్డ్ క్రైమ్, డ్రగ్ ట్రాఫికింగ్ వంటివి ఎదుర్కోవడానికి సహకారం అందిస్తుంది.
ఫీల్డ్ ఆఫీసర్లకు సహకారం: ఇది కాంప్లెక్స్ క్రైమ్‌లను పరిష్కరించడానికి స్థానిక పోలీసులకు అంతర్జాతీయ వనరులకు యాక్సెస్ అందిస్తుంది.
వేగవంతమైన ప్రాసెసింగ్: భారత్‌పోల్ అంతర్జాతీయ సహకారంలో జాప్యాన్ని తగ్గిస్తుంది. గ్లోబల్ థ్రెట్స్కి భారతదేశ ప్రతిస్పందనను మెరుగుపరుస్తుంది.
మెరుగైన సమన్వయం: ఇది కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత చట్ట అమలు సంస్థల మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరుస్తుంది.
భారత్పల్, ఇంటర్ పోల్
భారతదేశంలో ఇంటర్ పోల్ కు నేషనల్ సెంట్రల్ బ్యూరో (NCB)గా పనిచేస్తున్న సీబీఐ ఇంటర్నేషనల్ క్రైమ్ కోఆపరేషన్ మెయింటైన్ చేసే బాధ్యత వహిస్తుంది. ప్రస్తుతం, సీబీఐ సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఇంటర్పోల్తోతో కమ్యూనికేట్ చేస్తోంది. దీంతో దర్యాప్తు నెమ్మదిగా ఉంటుంది. భారత్త్పోల్తో ఈ ప్రాసెస్లు వేగంగా, మరింత సమర్థవంతంగా మారతాయి. సహాయం కోసం రిక్వెస్ట్ చేయడం, పారిపోయిన వారి కోసం రెడ్ కార్నర్ నోటీస్ వంటి కలర్-కోడెడ్ నోటీసులను జారీ చేయడం ఈజీ అవుతుంది. ఈ మోడర్నైజేషన్ పెరుగుతున్న అంతర్జాతీయ నేరాలతో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడానికి సహాయపడుతుంది.
అమిత్ షా విజన్
ఆధునిక నేరాలను అరికట్టేందుకు టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన ప్రాధాన్యతను కేంద్ర హెూంమంత్రి అమిత్ షా ఎత్తిచూపారు. భారత్పల్ను ఉపయోగించడంలో రాష్ట్ర ఏజెన్సీలకు శిక్షణ ఇవ్వాలని, గత ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త క్రిమినల్ చట్టాలపై వారికి అవగాహన కల్పించాలని ఆయన సీబీఐని కోరారు.
తాజా వార్తలు
- ఫారెస్ట్ అధికారుల పై సీఎం చంద్రబాబు సీరియస్
- కోస్టల్ బీచ్‌లలో ఖనిజాల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- పిల్లలకు అందుబాటులో వాట్సప్ కొత్త మోడల్
- ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- ఈద్ అల్ ఫితర్ సెలవులు ప్రకటించిన దుబాయ్..!!
- ఇరాన్ కోసం స్పై..నలుగురు బహ్రెయిన్ల అరెస్టు..!!
- లైసెన్స్ లేని ఆర్థిక కార్యకలాపాల పై ఫిర్యాదు చేయండి: CBK
- హరమైన్ హై-స్పీడ్ రైలును ఉపయోగించుకున్న 7లక్షల మంది ప్రయాణికులు..!!
- సలాలా పోర్టు పై ఇరాన్ దాడిని ఖండించిన ఖతార్..!!









