ఒక్క ఫొటోతో అందరినీ ఆలోచింపజేసిన ఆనంద్ మహీంద్ర
- January 08, 2025
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటూ ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తుంటారు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. ఆయన ఎక్స్‌లో చేసే పోస్టులు అందరినీ ఆలోచింపజేస్తుంటాయి. తాజాగా, ఆనంద్ మహీంద్ర మరో పోస్ట్ చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు.
రహదారిపై ట్రాఫిక్ లైట్ వద్ద తన కారు ఉన్న సమయంలో అందులో నుంచి ఆనంద్ మహీంద్రా ఈ ఫొటో తీశారు. రోడ్డుపై ఓ వ్యక్తి బైకుపై వెళ్తున్నాడు. ఆ బైకు వెనకాల కూర్చున్న వ్యక్తి శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని పట్టుకున్నాడు. ఆ బైక్ నడుపుతున్న వ్యక్తికి ఓ పక్క భక్తి భావం ఉంది కానీ, ట్రాఫిక్ రూల్స్ మాత్రం పాటించడంలేదు. ఆ బైకుపై ఉన్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోలేదు.
ఈ విషయాలన్నింటినీ గుర్తించిన ఆనంద్ మహీంద్ర దీనిపై స్పందిస్తూ.. “ట్రాఫిక్ లైట్ పడిన సమయంలో ఈ ఫొటోని చివరి క్షణంలో తీయగలిగాను. దేవుళ్లు మనల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూనే ఉంటారు. అయినప్పటికీ, హెల్మెట్ ధరించడం మంచిది” అని పేర్కొన్నారు. ఆనంద్ మహీంద్ర చేసిన ఈ ట్వీట్ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







