జపాన్ ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్..

- January 11, 2025 , by Maagulf
జపాన్ ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్..

1993లో జపాన్, ఇండియా ఫిలిం మేకర్స్ కలిసి ‘రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్’ అనే యానిమేషన్ సినిమా తీసిన సంగతి తెలిసిందే. మన రామాయణం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. జపాన్ లో 1997లో ఈ సినిమా రిలీజయింది. అక్కడి టీవీలలో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయింది. ఇండియాలో పలు ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శించినా అధికారికంగా ఇప్పటివరకు కూడా రిలీజ్ కాలేదు.

ఇటీవలే రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ఇండియాలో రిలీజ్ కానున్నట్టు ప్రకటించారు. జనవరి 24న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా భారీగా రిలీజ్ కాబోతుంది. తాజాగా రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో రాముడు ఋషుల యాగాలను కాపాడటం, సీత స్వయంవరం, వనవాసానికి రావడం, రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడం, హనుమంతుడు లంకకు వెళ్లడం, అందరూ సముద్రాన్ని దాటడం, రామ – రావణ యుద్ధం.. ఇలా రామాయణంలోని ప్రతి ఘట్టాన్ని చూపించారు.

మీరు కూడా రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ తెలుగు ట్రైలర్ చూసేయండి..జపనీస్ యానిమే స్టైల్ లో ఈ సినిమాని తెరకెక్కించారు. జపాన్ కి చెందిన యుగో సాకో ఈ రామాయణాన్ని నిర్మించగా జపాన్ కి చెందిన కోయిచి ససకి, ఇండియాకు చెందిన రామ్ మోహన్ లు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దాదాపు 450 మంది ఆర్టిస్ట్స్, ఒక లక్ష మంది హ్యాండ్ డ్రాన్ సేల్స్ ద్వారా ఈ విజువల్ మాస్టర్ పీస్ ని తెరకెక్కించారు. రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు తెలుగులో డైలాగ్స్ రాశారు.

ఇప్పుడు సినిమాని ఇండియాలో రిలీజ్ చేస్తున్న నిర్మాత అర్జున్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఇండియన్ హెరిటేజ్ ని గొప్ప గా సెలబ్రేట్ చేసుకొనే విధంగా ఈ రామాయణం సినిమాని రూపొందించారు. కచ్చితంగా థియేటర్స్ లో ఈ సినిమాని అందరూ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రామాయణం కథ ఎంతో మంది భారతీయుల్ని కదిలించింది. ఇంతకు మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమా ఉంటుంది అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com