శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం!

- January 13, 2025 , by Maagulf
శబరిమల దేవస్థానం కీలక నిర్ణయం!

కేరళ: తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో 6 మంది చనిపోవడం దేశంలోని సంచల వార్తగా మారింది. దీనితో మకరజ్యోతి దర్శనం వేళ భక్తుల సంఖ్య అనూహ్యంగా ఉండటంతో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి ఘటన తరువాత ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఆన్‌లైన్ టికెట్ల సంఖ్యను తగ్గించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పలు నిర్ణయాలు అమలు చేస్తున్నారు. టికెట్ల జారీ పైన ప్రకటన చేసారు. తాజాగా శబరిమల యాత్రీకులకు భీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రకటించారు.

శబరిమలలో అయ్యప్ప భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మకరజ్యోతి దర్శనం కోసం లక్షలాది భక్తులు శబరిమల చేరుకున్నారు. తాజాగా తిరుపతి ఘటన నేపథ్యంలో ట్రావెన్ కోర్ దేవస్థానం అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తుల రద్దీ పెరిగినా.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఆన్‌లైన్ టికెట్ల సంఖ్యను తగ్గించిన అధికారులు ఈ రోజు, రేపు ఇచ్చే టికెట్ల గురించి స్పష్టత ఇచ్చారు.
తాజాగా, శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్రీకులు అందరికీ ట్రావెన్​కోర్ దేవ స్వం బోర్డ్ (టీడీబీ) రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పింస్తూ నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం 13,600 మంది పోలీసు అధికారులకు బాధ్యతలు అప్పగించారు.2,500 మంది అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది, 1000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ని విధుల్లో కేటాయించారు. అదే విధంగా యాత్రీకల కోసం పంబ, అప్పాచిమేడు, సన్నిధానం సహా సమీపంలోని ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. యాత్రీకుల కోసం ఎస్ఎంఎస్ ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. రేపు (మంగళవారం) సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు..మకరజ్యోతి దర్శనం కలగనుంది. తిరుపతి ఘటన..గత విషాదాలతో ఈ సారి దేవస్థాన అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. ఏ చిన్న పొరపాటుకు అవకాశం లేకుండా అన్ని విభాగాలను అప్రమత్తం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com