మహా కుంభమేళాలో ‘అఖండ 2’ షూటింగ్ ప్రారంభం
- January 14, 2025
ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా అఖండ, వీరసింహ రెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. తాజాగా నిన్న డాకు మహారాజ్ సినిమాతో వచ్చి మరో హిట్ కొట్టాడు. ఇప్పటికే మొదటి రోజు డాకు మహారాజ్ సినిమా 56 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బాలయ్య ఊపు ఇప్పట్లో ఆగేలా లేదు.
డాకు మహారాజ్ తర్వాత బాలయ్య అఖండ 2 సినిమాతో రానున్నాడు. అయితే ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో నేటి నుంచి ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో అఖండ 2 షూటింగ్ చేస్తున్నట్టు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక్కడికి కోట్ల మంది భక్తులతో పాటు సాధువులు, అఘోరాలు భారీ సంఖ్యలో హాజరవుతారు.
అఖండ సినిమాలో బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. అదే పాత్రని పార్ట్ 2 లో కంటిన్యూ చేయనున్నారు. దీంతో అఖండ పాత్ర కుంభమేళాలో ఉన్నట్టు, అక్కడ అఘోరాలతో కలిసి తిరుగుతున్నట్టు, అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేసినట్టు కొన్ని షాట్స్ షూటింగ్ చేస్తున్నట్టు సమాచారం. దీంతో డివైన్ షాట్స్ ఈ సారి మరింత గ్రాండ్ గా ఉండనున్నాయని తెలుస్తుంది. అన్ని లక్షల మంది జనాల్లో బాలయ్యతో షూట్ ప్లాన్ చేయడం, బాలయ్య ఒప్పుకోవడం, రియల్ లొకేషన్స్ లో రియల్ అఘోరాలతో షూట్ ప్లాన్ చేయడం గ్రేట్ అనే చెప్పొచ్చు.
దీంతో బాలయ్య ఫ్యాన్స్ అఖండ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాని సెప్టెంబర్ 25 దసరాకు రిలీజ్ చేస్తారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిన్న మ్యూజిక్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అఖండ సినిమా ఏ రేంజ్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. దీంతో అఖండ 2 పాన్ ఇండియా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇక ఈ సినిమాని బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంటలు నిర్మాతలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో ఇది 4వ సినిమా కానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







