కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు
- January 14, 2025
న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు (సోమవారం) సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తన నివాసంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సంబరాల నేపథ్యంలో తెలుగు సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా కిషన్ రెడ్డి ఇంటిని అలంకరించారు. అతిథులకు తెలుగు వంటలను సైతం రుచి చూపించేలా పలు వంటకాలను సిద్ధం చేశారు.
కాగా, ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. వీరితో పాటు పలువురు కేంద్రమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసానికి చేరుకున్న ప్రధాని మోదీకి, చిరంజీవికి ఘనస్వాగతం సాదర స్వాగతం పలికారు. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!
- ఈద్ కోసం కొత్త నోట్లను అందిస్తున్న సెంట్రల్ బ్యాంక్..!!
- SR3.8 మిలియన్ల ఫైన్ విధించిన ఏవియేషన్ అథారిటీ..!!
- వార్షిక దినోత్సవం, ఘబ్గాను జరుపుకున్న ILA..!!
- Dh32 ప్రీమియం..ఇండియన్ వర్కర్స్ కోసం కొత్త బీమా పథకం..!!
- యాంకుల్లోని వాడి బైహా డ్యామ్ నిర్మాణం పూర్తి..!!
- తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రమదాన్ తోఫా పంపిణీ
- APSDMA రెడ్ అలర్ట్ ..47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు..
- ఒమన్ లో ఇండియన్ ఎంబసీ కాన్సులర్ సేవల్లో మార్పులు..!!
- ప్రపంచంలోనే రెండవ సురక్షితమైన దేశంగా యూఏఈ.!!