కేరళకు గల్ఫ్ ఎయిర్ సేవలు కుదింపు.. నిరసనల వెల్లువ..!!

- January 16, 2025 , by Maagulf
కేరళకు గల్ఫ్ ఎయిర్ సేవలు కుదింపు.. నిరసనల వెల్లువ..!!

మనామా: కాలికట్‌కు విమానాలను రద్దు చేసి, కొచ్చికి సేవలను తగ్గించాలని గల్ఫ్ ఎయిర్ తీసుకున్న నిర్ణయంపై కేరళవాసులు మండిపడున్నారు. ఆన్‌లైన్‌లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ ఎయిర్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తరతరాలుగా భారతీయులను అవకాశాలకు ఈ నిర్ణయం దెబ్బతీస్తుందని వారు వాపోతున్నారు.  కోజికోడ్ జిల్లా ప్రవాసీ ఫోరమ్ (KPF) ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.

ఇండియాలోని కేరళ రాష్ట్రంలోని మలబార్ తీరంలో ఉన్న కాలికట్ చారిత్రాత్మకంగా గల్ఫ్‌కు, ముఖ్యంగా బహ్రెయిన్, ఇతర GCC దేశాలకు వెళ్లే ప్రయాణికులకు కీలకమైన కేంద్రంగా ఉందని KPF స్పష్టం చేసింది.   గల్ఫ్‌తో కాలికట్ సంబంధం శతాబ్దాల నాటిదని, ప్రపంచ సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ప్రముఖ ఓడరేవు నగరంగా ఉందని గుర్తుచేశారు. 1970వ దశకంలో కేరళ నుండి చమురు సంపన్న గల్ఫ్ ప్రాంతానికి వలసలు ప్రారంభమైనప్పుడు ఈ సంబంధం మరింత బలపడిందని చెబుతున్నారు.   కాలికట్‌కు గల్ఫ్ ఎయిర్ ఆక్యుపెన్సీ రేట్లు 90 శాతానికి మించి ఉన్నాయని, ఇది ఈ సేవలకు ఉన్న అధిక డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని గుర్తుచేస్తున్నారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com