ఒమన్ లో డ్రగ్స్ స్మగ్లింగ్, చోరీలు..పలువురు అరెస్ట్..!!
- January 16, 2025
మస్కట్: ఒమన్ లో పలు కేసుల్లో నిందితులను పోలసులు అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత ప్రాంతం నుండి మెటల్ పైపులను దొంగిలించిన నలుగురు వ్యక్తులను ఆయిల్ అండ్ గ్యాస్ ఫెసిలిటీస్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మరో కేసులో జనరల్ డైరెక్టరేట్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్.. 85 కిలోగ్రాముల క్రిస్టల్ మెత్, హషీష్, గంజాయి, 24వేల సైకోట్రోపిక్ పిల్స్ ను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు విదేశీ పౌరులను పట్టుకుంది.
అదే విధంగా నార్త్ అల్ బతినా గవర్నరేట్ పోలీసులు.. లివాలోని విలాయత్‌లోని వేర్వేరు ప్రదేశాల నుండి రెండు వాహనాలను దొంగిలించిన కేసులో నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుండి మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితులపై చట్టపరమైన చర్యలు పూర్తయినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







