ఖతార్ లో వేగంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..మెరైన్ అలెర్ట్ జారీ..!!
- January 17, 2025
ఖతార్: ఖతార్ వాతావరణ విభాగం (QMD) సూచన ప్రకారం.. జనవరి 17 నుండి గాలులు వీచే అవకాశం ఉంది. అలలు ఎగసిపడుతుండటంతో సముద్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాతావరణం వచ్చే వారం మధ్య వరకు కొనసాగుతుందని ఆ శాఖ పేర్కొంది. వారాంతంలో అలల ఎత్తు 3-7 అడుగుల మధ్య ఉంటుందని, అప్పుడప్పుడు కొన్నిసార్లు 10 అడుగులకు చేరుకుంటుందన్నారు. పౌరులు, నివాసితులు జాగ్రత్తగా ఉండాలని, హెచ్చరిక సమయంలో అన్ని సముద్ర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. ఈ వారాంతంలో ఉష్ణోగ్రతలు కూడా 13°C నుండి 23°C వరకు ఉంటాయన్నారు. అల్ నయీమ్ నక్షత్రం ఇటీవలి పెరుగుదలతో రాబోయే రోజుల్లో విపరీతమైన చలి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 13 రోజుల పాటు కొనసాగుతుందన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన రెయిన్స్..!!
- అల్ ఖుద్రా సైక్లింగ్ ట్రాక్ ను మూసేసిన దుబాయ్..!!
- మిడిలీస్టు అంతరిక్ష సదస్సుకు ఒమన్ ఆతిథ్యం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే వద్ద ఉచిత వై-ఫై..!!
- మెట్రోలింక్ అప్డేట్ ప్రకటించిన దోహా మెట్రో..!!
- కువైట్ లో ఇల్లిగల్ అల్కాహాల్ ఫ్యాక్టరీ ధ్వంసం..!!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స







