కొచ్చి డైలాగ్ 2025లో కువైట్..ఇండియా-జిసిసి సంబంధాలపై ఫోకస్..!!
- January 18, 2025
కేరళ: ఇండియ- GCC దేశాల మధ్య సంబంధాలను సుస్థిరం చేయడానికి ఇండియా, గల్ఫ్ సహకార మండలి "కొచ్చి డైలాగ్ 2025"ను నిర్వహించింది. ఇందులో కువైట్ పాల్గొంది. "ఇండియాస్ లుక్ వెస్ట్ పాలసీ ఇన్ యాక్షన్: పీపుల్, ప్రోస్పెరిటీ అండ్ ప్రోగ్రెస్" అనే థీమ్‌తో కేరళలోని కొచ్చిలోని సెంటర్ ఫర్ పబ్లిక్ పాలసీ రీసెర్చ్ థింక్ ట్యాంక్ ద్వారా నిర్వహించారు. ఫోరమ్ ముఖ్య వక్తలలో ఒకరైన జిసిసి సెక్రటరీ-జనరల్ జాసెమ్ మొహమ్మద్ అల్-బుదైవి మాట్లాడుతూ.. గల్ఫ్ కూటమికి ఇండియా సంబంధాల ప్రాముఖ్యతను హైలైట్ చేసారు. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలలో పాల్గొనడం ద్వారా సహకారాన్ని ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఈ 2025లో తమ మొదటి రౌండ్ FTA చర్చలు జరుపుతామని కూడా నేను ఆశిస్తున్నాను. ”అని అల్-బుదైవి తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతదేశం నుండి ప్రభుత్వ అధికారులు, వ్యాపార ప్రముఖులు, అలాగే GCC దేశాల ప్రతినిధులు - ఒమన్, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా మరియు UAE - ఆస్ట్రేలియా, మలేషియా మరియు శ్రీలంక నుండి దౌత్యవేత్తలు పాల్గొన్నారు.
'ఇండియా,GCC: వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, పెట్టుబడులను మెరుగుపరచడంలో అవకాశాలు, సవాళ్లు' సెషన్‌లో ICAI కువైట్ చాప్టర్ ఛైర్‌పర్సన్ CA ఆదిత్య విక్రమ్ ధనుక పాల్గొని మాట్లాడారు. GCC దేశాలు –ఇండియా మధ్య వాణిజ్యం, పెట్టుబడులలో సహకార ప్రయత్నాలపై సెషన్ దృష్టి సారించింది. అకౌంటింగ్ అసోసియేషన్ భారతీయ ప్రమాణాల నుండి IFRS ప్రమాణాలకు మారాల్సిన అవసరం ఉందని, దీని కోసం IFRS స్టాండర్డైజేషన్‌కు అనుగుణంగా ఇండియాకి ప్రత్యేక కౌన్సిల్ అవసరమని కువైట్‌కు చెందిన ఆదిత్య ధనుక అన్నారు. ముఖ్యంగా కువైట్‌లోని భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు మరిన్ని ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







