బ్నిద్ అల్-కర్ లో 53 వాహనాలు స్వాధీనం..!!
- January 19, 2025
కువైట్: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ.. బ్నిద్ అల్-కర్ ప్రాంతంలో భద్రతా తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా 1,521 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలను నమోదు చేసింది. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టు వారెంట్ల అమలు కోసం 12 మందిని, 4 మంది నివాస, కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు, ఎలాంటి పత్రాలు లేని నలుగురిని, గైర్హాజరీ కేసులలో నిందిలులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో 53 వాహనాలు, మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ ఫహద్ అల్-యూసెఫ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో తనిఖీలు నిర్వహించినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ-భారత్ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..
- తిరుమలలో ఈ నెల 11 నుంచి 20 వరకు వీఐపీ దర్శనాలు రద్దు
- ఫోన్ స్కామ్‌తో Dh11.8 మిలియన్ మోసం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన దుబాయ్ పోలీసులు
- ఒమన్ సమీపంలో ట్యాంకర్‌పై దాడి..12 మందికి గాయాలు
- రాహుల్ గాంధీ, ప్రియాంకను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వీక్ 2026కు యూఏఈలో శ్రీకారం
- సౌదీ అరేబియాకు బహ్రెయిన్ మద్దతు..!!
- ఒమన్‌లో 10 ఏళ్ల బాలుడు గల్లంతు..కొనసాగుతున్న గాలింపు..!!
- ఖతార్‌లో వరల్డ్ స్పేస్ వీక్ 2026 ప్రారంభం..!!
- కువైట్‌లో 194 మంది ప్రవాసుల డిపోర్ట్..!!







