యూఏఈలో జనవరి 30న హాలిడే ఉంటుందా?

- January 21, 2025 , by Maagulf
యూఏఈలో జనవరి 30న హాలిడే ఉంటుందా?

యూఏఈ: ఇస్రా వాల్ మిరాజ్ సందర్భంగా ఒమన్, కువైట్ దేశాలు జనవరి 30న(గురువారం) హాలిడే ప్రకటించాయి.  ప్రైవేట్ రంగ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించారు. ఆయా దేశాల నివాసితులు  వారాంతం (శుక్రవారం, శనివారం)తో కలిపి మొత్తం 3 రోజుల సెలవులను పొందనున్నారు.  

కాగా, యూఏఈ నివాసితులకు అల్ ఇస్రా వాల్ మిరాజ్ కోసం సెలవు ప్రకటించలేదు. గతంలో 2018 వరకు యూఏఈ తన అధికారిక సెలవుల జాబితాలో ఆరోజున సెలవు ప్రకటించారు. అయితే, 2019లో ప్రభుత్వం దానిని జాబితా నుండి మినహాయించాలని నిర్ణయించింది. అదే సంవత్సరం కేబినెట్ ప్రభుత్వ,  ప్రైవేట్ రంగ సెలవులను యూనిఫైడ్ చేసింది.  

ఇస్రా వాల్ మిరాజ్ అంటే ఏమిటి?

ఇస్రా వాల్ మిరాజ్ అనేది మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ నుండి జెరూసలేంలోని మస్జిద్ అల్ అక్సా వరకు ప్రవక్త ముహమ్మద్ (స) ప్రయాణించిన రాత్రిగా పరిగణిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం, ఈ సంవత్సరం జనవరి 27న వచ్చే రజబ్ 1446 27వ రాత్రి ఇస్రా వాల్ మిరాజ్ జరుపుకుంటారు.

యూఏఈలో తదుపరి ప్రభుత్వ సెలవుదినం ఎప్పుడు?

యూఏఈలో తదుపరి ప్రభుత్వ సెలవుదినం ఇస్లామిక్ సెలవుదినం ఈద్ అల్ ఫితర్ ఈ సంవత్సరం నివాసితులకు నాలుగు రోజుల వరకు సెలవు వస్తుంది. యూఏఈ క్యాబినెట్ ప్రకారం, షవ్వాల్ మొదటి మూడు రోజులు (రమదాన్ తర్వాత నెల) సెలవులు. రమదాన్ 30 రోజులు కొనసాగితే, రమదాన్ 30వ తేదీ కూడా సెలవుదినం అవుతుంది, నివాసితులకు నాలుగు రోజుల విరామం (రమదాన్ 30 నుండి షవ్వాల్ 3 వరకు) ఇస్తుంది. అయితే, రమదాన్ 29 రోజులు ఉంటే, సెలవు ఈద్ మొదటి మూడు రోజులు (షవ్వాల్ 1 నుండి షవ్వాల్ 3 వరకు) మాత్రమే వర్తిస్తుంది. చంద్రుడి కనిపించడం ఆధారంగా, రమదాన్ మార్చి 1( శనివారం) ప్రారంభమై, మార్చి 30 (ఆదివారం) ముగిస్తే, ఈద్ అల్ ఫితర్ మార్చి 31(సోమవారం) నుండి ఏప్రిల్ 2(బుధవారం) వరకు ఉంటుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com